నష్టాల ఊబిలో ఎయిర్‌టెల్!
టెలికం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నష్టపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.97.30 కోట్ల లాభాలను ఆర్జించిన సంస్థ తాజాగా రూ.2,866 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఇక, ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.1,469.40 కోట్ల అసాధారణ నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ.362.10 అసాధారణ నష్టాన్ని చవిచూసింది. అయితే, అదే సమయంలో ఎయిర్‌టెల్ ఆదాయం 4.59 శాతం పెరిగి […]
టెలికం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నష్టపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.97.30 కోట్ల లాభాలను ఆర్జించిన సంస్థ తాజాగా రూ.2,866 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఇక, ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.1,469.40 కోట్ల అసాధారణ నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ.362.10 అసాధారణ నష్టాన్ని చవిచూసింది.
అయితే, అదే సమయంలో ఎయిర్‌టెల్ ఆదాయం 4.59 శాతం పెరిగి రూ.20,812.50 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది రూ.19,898 కోట్లుగా ఉంది. జూన్30 నాటికి భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 40.37 కోట్లు కాగా, గతేడాది ఇదే సమయంలో 45.66 కోట్ల మంది ఖాతాదారులున్నారు. జూన్ మాసాంతానికి 10.9 మంది ఖాతాదారులను కోల్పోయింది. అయితే, ఏకీకృత ఈబీఐటీడీఏ(వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం) 24.20 శాతం పెరిగి రూ.8492.60 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఏకీకృత ఈబీఐటీడీఏ రూ.6,837 కోట్లుగా ఉంది.