AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement Plan: రిటైర్‌‌మెంట్ తర్వాత నెలకు రూ.2 లక్షలు రావాలంటే ప్లానింగ్ ఇలా ఉండాలి!

ఇప్పటి జనరేషన్ లో చాలామంది రిటైర్మెంట్ గురించి రిటైర్మెంట్ తర్వాత అవసరమయ్యే ఖర్చుల గురించి ఆలోచించరు. దాంతో అసలు పొదుపు అనేది లేకుండా డబ్బుని ఎక్కువగా వృథా ఖర్చు చేసేస్తుంటారు. అయితే యంగ్ ఏజ్ లోనే రిటైర్మెంట్ ప్లాన్ చాలా అవసరం అని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. అదెలా ఉండాలంటే..

Retirement Plan: రిటైర్‌‌మెంట్ తర్వాత నెలకు రూ.2 లక్షలు రావాలంటే ప్లానింగ్ ఇలా ఉండాలి!
Mutual Funds 7
Nikhil
|

Updated on: Oct 26, 2025 | 12:37 PM

Share

రిటైర్మెంట్ అంటే విశ్రాంతి తీసుకునే సమయం. ఆ వయసులో కష్టపడి ఉద్యోగం చేయడం, సంపాదించడం కుదరకపోవచ్చు. కాబట్టి అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ మొదలు పెట్టాలి. నిపుణులు ప్రకారం రిటైర్మెంట్ తర్వాత మంచి ఫండ్ సమకూరాలంటే ఇప్పట్నుంచే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది. రిటైర్మెంట్ నాటికి ప్రతి నెలా రూ. 2 లక్షలు రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం.

ప్లానింగ్ ఇలా..

మీరు 55 లేదా 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేయబోతున్నట్లయితే దానికి 35 ఏళ్ల వయసు నుంచే పెట్టుబడి మొదలు పెట్టాలి. ఈ జనరేషన్ లో చాలామంది ఎర్లీ రిటైర్మెంట్ కోరుకుంటున్నారు. అంటే 50 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులోనే రిటైర్ అవ్వాలని కలలు కంటుంటారు. మరి అలాంటప్పుడు ఇన్వెస్ట్ మెంట్స్ ముందు నుంచే మొదలుపెట్టాలి. రిటైర్ మెంట్ కలలు నెరవేరాలంటే దానికి తగిన డబ్బు కచ్చితంగా ముందే సమకూర్చుకోవాలి. పెట్టుబడులు ఆలస్యంగా మొదలుపెడితే రిటైర్మెంట్ నాటికి వచ్చే ఫండ్ వాల్యూ తగ్గిపోతుంటుంది.  కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

రూ. 2 లక్షలు రావాలంటే..

ఒకవేళ మీరు కెరీర్  మొదట్లో తక్కువ పెట్టుబడి పెట్టినా  40 ఏళ్ల వయసు నుంచి కనీసం నెలకు రూ. 25,000 SIP ద్వారా పెట్టుబడి పెట్టాలి.  అలాగే ప్రతి సంవత్సరం పెట్టుబడి మొత్తంలో 10% జోడిస్తూ పోవాలి. ఇలా చేస్తే 60 ఏళ్ల నాటికి మీ ఫండ్  రూ.3.50 కోట్లు దాటుతుంది. SWP (సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్) ద్వారా ఈ పెట్టుబడి నుంచి నెలకు రూ. 2 లక్షలు తీసుకున్నా.. జీవితకాలం పాటు ఫండ్ సరిపోతుంది.   ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం పైన చెప్పిన ఫార్ములా ప్రకారం యంగ్ ఏజ్ నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. రిటైర్మెంట్ నాటికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితాన్ని గడపొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి