Recharge Plans: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలు పొందే అవకాశం.. స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్
టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల టెలికం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామల వినియోగం పెరిగిన తర్వాత వారిని టార్గెట్ చేసుకొని రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నారు..
టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల టెలికం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామల వినియోగం పెరిగిన తర్వాత వారిని టార్గెట్ చేసుకొని రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే పలు టెలికం సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందించే ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల్లో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా లభిస్తున్న కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా లభిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్‌లో రూ. 1299 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ను ఉచింగా యాక్సెక్ చేసుకోవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ లభించే ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. మొత్తం 168 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు.
* ఇక జియో అందిస్తోన్న మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌లో రూ. 1799 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. రోజూ 3 జీబీ డేటా పొందొచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
* నెట్ ఫ్లిక్స్ ఉచితంగా పొందేలా వొడాఫోన్ ఐడియా రూ. 1198 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ డేటా పొందొచ్చు. మొత్తం 140 జీబీ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.
* వొడాఫోన్ ఐడియా అందిస్తోన్న మరో బెస్ట్ ఫ్లాన్ రూ. 1599. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తోంది. ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా పొందొచ్చు. మొత్తం 210 జీబీ డేటా లభిస్తుంది. ఇక ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో పాటు.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.
* ఇక ఎయిర్ కూడా ఇలాంటి ఒక ప్లాన్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన రూ. 1798 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతీ రోజూ 3 బీబీ డేటా చొప్పున మొత్తం 252 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..