Recharge Plans: రూ.300లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ రీఛార్జ్ ఆఫర్లు.. మూడు టెలికాం కంపెనీలు అందిస్తోన్న బెన్‌ఫిట్స్..
Best Recharge Plans Under Rs.300: టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరగడంతో అది వినియోగదారులకు లాభంగా మారుతోంది. పోటీ పెరగడంతో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్‌ఐడియా (వీఐ)లు...
Best Recharge Plans Under Rs.300: టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరగడంతో అది వినియోగదారులకు లాభంగా మారుతోంది. పోటీ పెరగడంతో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్‌ఐడియా (వీఐ)లు రూ.300 లోపు రీఛార్జ్ ప్లాన్స్‌తో అందిస్తోన్న ఆఫర్లపై ఓ లుక్కేయండి.
రూ.300లోపు జియో అందిస్తోన్న ఆఫర్లు..
జియో రూ.249:
* ప్రతిరోజూ 2జీబీ డేటా * ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్. * రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు. * 28 రోజుల వ్యాలిడిటీ. * జియో యాప్‌లను ఉచితంగా పొందొచ్చు.
జియో రూ.199..
* ప్రతిరోజూ 1.5 జీబీ డేటా. * ఏ నెట్ వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్. * రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు. * 28 రోజుల వ్యాలిడిటీ.
రూ.300లోపు ఎయిర్‌టెల్ అందిస్తోన్న ఆఫర్లు..
ఎయిర్‌టెల్ రూ. 298:
* 2జీబీ డేటాతో పాటు 30 రోజులపాటు అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (మోబైల్ ఎడిషన్). * 28 రోజుల వ్యాలిడిటీ. * ఏ నెట్ వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్.
ఎయిర్‌టెల్ రూ. 279:
* ప్రతిరోజూ 1.5 జీబీ డేటా. * ఏ నెట్ వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్. * 28 రోజుల వ్యాలిడిటీ.
రూ.300లోపు వొడాఫోన్‌ఐడియా అందిస్తోన్న ఆఫర్లు..
వీఐ రూ.299:
* ప్రతి రోజూ 4 జీబీ డేటా. * ఏ నెట్ వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్. * రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు. * 28 రోజుల వ్యాలిడిటీ.