AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Mileage Cars: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్స్.. వివరాలు మీకోసం..

Best Mileage Cars: కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారు ముందు మైలేజీ, సేఫ్టీ, అందులోని ఫీచర్లు, ధరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. తక్కువ ధరకు మంచి మైలేజీ వచ్చే వాహనాలకు

Best Mileage Cars: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్స్.. వివరాలు మీకోసం..
Best Mileage Cars
Shiva Prajapati
|

Updated on: Feb 11, 2023 | 9:11 AM

Share

కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారు ముందు మైలేజీ, సేఫ్టీ, అందులోని ఫీచర్లు, ధరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. తక్కువ ధరకు మంచి మైలేజీ వచ్చే వాహనాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే.. మీకోసం అద్దిరిపోయే న్యూస్ ఇది. తక్కువ ధరకే మంచి మైలేజీని ఇచ్చే కార్ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ లిస్ట్ లోని కార్లు సరసమైన ధరకు లభించడం మాత్రమే కాదు.. సుమారు 36 kmpl వరకు మైలేజీని ఇస్తాయి. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, టయోటా గ్లాంజా వంటి కార్లు ఉన్నాయి. తక్కువ ధరకే, ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తక్కువ ధరలకు మంచి మైలేజీని ఇచ్చే ఈ కార్ల జాబితాలో పెట్రోల్, సిఎన్‌జి కార్లు ఉన్నాయి. మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, టయోటా గ్లాంజా CNG వెర్షన్ 31km/kg మైలేజీని అందిస్తుంది. మారుతి స్విఫ్ట్ ధర రూ. 5.99-8.96 లక్షల (ఎక్స్-షోరూమ్), మారుతి బాలెనో ధర రూ. 6.45-9.66 లక్షల(ఎక్స్-షోరూమ్), టయోటా గ్లాంజా ఎక్స్-షోరూమ్ ధర రూ.6.59-9.99 లక్షలుగా ఉంది.

మారుతి సుజుకి ఆల్టో 800..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి ఆల్టో 800 మైలేజీ పరంగా కూడా గొప్పగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.53 లక్షల నుండి రూ.5.12 లక్షల వరకు ఉంది. పెట్రోల్‌తో పాటు, ఈ కారు CNG ఆప్షన్‌ కూడా ఉంది. మారుతి ఆల్టో 800 CNG వెర్షన్ 32km/kg మైలేజీని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో..

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో దేశంలోని అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటి. పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో వస్తున్న ఈ కారు కిలోకి 33 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారును రూ.4.25-6.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్..

భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్ల జాబితాలో మారుతి వ్యాగన్ఆర్ కూడా అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ఆర్ CNG వెర్షన్ 34km/kg మైలేజీని అందిస్తుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.52-7.39 లక్షలు. ఈ కారు పెట్రోల్, CNG వేరియంట్లలో కూడా వస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో..

భారతదేశపు అత్యంత మైలేజ్ సమర్థవంతమైన కార్లలో మారుతి సెలెరియో కూడా ఒకటి. ఈ విలాసవంతమైన హ్యాచ్‌బ్యాక్ కారు కిలో సీఎన్‌జి కి 36 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.33-7.12 లక్షలు.

గమనిక: కారు మైలేజ్ మరియు ధర గురించిన సమాచారం డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ నుండి తీసుకోబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్