Business Idea: రూ. 20 వేల పెట్టుబడితో రూ. లక్షల్లో ఆదాయం.. బెస్ట్ బిజినెస్ ప్లాన్‌

నిమ్మగడ్డి పెంపకం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. గడ్డితో లక్షల్లో ఆదాయం ఎలా వస్తుందని ఆశ్చర్యపోతుండొచ్చు. కానీ నిమ్మగడ్డి సాదాసీదా గడ్డి కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని నుంచి సువాసన ఉత్పత్తులు తయారు చేస్తారు. దీంతో ఈ గడ్డికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు...

Business Idea: రూ. 20 వేల పెట్టుబడితో రూ. లక్షల్లో ఆదాయం.. బెస్ట్ బిజినెస్ ప్లాన్‌
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 23, 2024 | 6:28 PM

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. అయితే పెట్టుబడి పెట్టాలని వెనకడుగు వేస్తుంటారు. అయితే సరైన ఆలోచన ఉండాలే కానీ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందే వ్యాపారం చేయొచ్చు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

నిమ్మగడ్డి పెంపకం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. గడ్డితో లక్షల్లో ఆదాయం ఎలా వస్తుందని ఆశ్చర్యపోతుండొచ్చు. కానీ నిమ్మగడ్డి సాదాసీదా గడ్డి కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని నుంచి సువాసన ఉత్పత్తులు తయారు చేస్తారు. దీంతో ఈ గడ్డికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. దీంతో ఔషధాల తయారీలోనూ ఈ గడ్డిని ఉపయోగిస్తుంటారు. ఈ వాణిజ్య పంట ద్వారా నాటిన 4 నెలల వెంటనే కోతకి వస్తుంది. ప్రస్తుతం లెమన్ గ్రాస్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మండి డిమాండ్‌ ఉంది.

ఈ గడ్డిని పండించేందుకు ఖాళీ స్థలం అవసరం ఉంటుంది. పంటను పండించేందుకు కేవలం రూ. 20 వేలు ఉంటే చాలు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వ్యవసాయం చేయడం మొదలు పెడితే 4 నుంచి 6 ఏళ్ల వరకు ఉత్పత్తి వస్తూనే ఉంటుంది. నిమ్మగడ్డి ఒకసారి నాటిన తరువాత 4-5 సంవత్సరాలు భూమిలో ఉంటుంది. కాబట్టి భూమిని బాగా లోతుగా పలుమార్లు ఇరువైపుల దున్ని బాగా తయారుచేసుకోవాలి. ఒక ఎకర పొలంలో నాటడానికి 15000 పిలకలు అవసరం ఉంటాయి.

ఇక నిమ్మగడ్డి నుంచి తీసే నూనెకు మరింత డిమాండ్ ఉంది. మనమే సొంతం నూనెను తీసి విక్రయిస్తే మరింత లాభం పొందొచ్చు. ఒక క్వింటాల్ నిమ్మ గడ్డి నుంచి ఒక లీటరు నూనె తీయొచ్చు. దీని ధర మార్కెట్‌లో రూ. 1000 నుంచి రూ. 1500 వరకు పొందొచ్చు. ఐదు టన్నుల నిమ్మగడ్డి ద్వారా సుమారు రూ. 3 లక్షల వరకు లాభం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..