AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Locker: బ్యాంకులో లాకర్ ఉన్న కస్టమర్లకు అలెర్ట్.. కొత్త రూల్స్ గురించి తప్పక తెలుసుకోండి..

Bank Locker News: చాలా మంది తమ నగలుతో పాటు.. ఇతర ముఖ్యమైన వస్తువులను దాచుకునేందుకు బ్యాంకు లాకర్లను ఎంచుకుంటారు. దొంగల భయం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ వస్తువులను బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు. దీనికోసం బ్యాంకులకు కొంత రుసుము..

Bank Locker: బ్యాంకులో లాకర్ ఉన్న కస్టమర్లకు అలెర్ట్.. కొత్త రూల్స్ గురించి తప్పక తెలుసుకోండి..
Bank Lockers
Ganesh Mudavath
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 13, 2022 | 2:41 PM

Share

Bank Locker Alert: చాలా మంది తమ నగలుతో పాటు.. ఇతర ముఖ్యమైన వస్తువులను దాచుకునేందుకు బ్యాంకు లాకర్లను ఎంచుకుంటారు. దొంగల భయం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ వస్తువులను బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు. దీనికోసం బ్యాంకులకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తమ ఖాతాదారులకు ఈ సేవలు అందించినందుకు గానూ బ్యాంకులకు కొంత ఆదాయం సమకూరుతుంది. ఒక్కో బ్యాంకుల్లో ఒక్కో విధంగా రుసుము వసూలు చేస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు.. దాదాపు ప్రయివేటు రంగ బ్యాంకులు సైతం ప్రస్తుతం లాకర్ సేవలు అందిస్తున్నాయి. చాలా మంది బ్యాంకు లాకర్లు కలిగి ఉంటారు. కాని దానికి సంబంధించిన పూర్తి నిబంధనలు తెలుసుకోరు. కేవలం సేవలు ఉపయోగించుకున్నందుకు ఎంత ఛార్జీ చేస్తారనే విషయాన్ని మాత్రమే ఎక్కువ మంది తెలుసుకుంటారు. అయితే బ్యాంకు లాకర్ కలిగిన ప్రతి ఒక్కరూ.. భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ఈఏడాది డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా లాకర్ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన 2023 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఖాతాదారులకు సందేశాలు పంపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం తమ బ్యాంకులో లాకర్ కలిగిన ఖాతాదారులు బ్యాంకుతో లాకర్ ఒప్పందం చేసుకోవాలని సూచిస్తూ ఎస్‌ఎంఎస్‌లు పంపుతోంది.

పంజాబ్ నేషనల్‌ బ్యాంకు తన ఖాతాదారులకు పంపిన సందేశం ప్రకారం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, కొత్త లాకర్ ఒప్పందాన్ని 2022 డిసెంబర్ 31లోపు చేసుకోవాలని, చేసుకోకపోతే బ్యాంకు అధికారులను సంప్రదించాలనిబ సూచిస్తూ మేసెజ్‌లు పంపింది. ఇప్పటికే లాకర్లు ఉన్నవారితో పాటు.. కొత్తగా లాకర్లు తీసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా కొత్త లాకర్ నిబంధనల గురించి తెలుసుకోండి. కొత్త లాకర్ నిబంధనలకు సంబంధించి 2021 ఆగష్టు 8వ తేదీన ప్రకటన జారీచేసింది. దీని ప్రకారం లాకర్‌కు సంబంధించిన అద్దె తదితర వివరాలు అన్ని తెలసుకుని, వాటన్నింటికి అంగీకారం తెలుపుతున్నట్లు బ్యాంకుతో లాకర్‌ ఒప్పందం చేసుకోవల్సి ఉంటుంది.

లాకర్ ఒప్పందం అంటే ఏమిటి?

లాకర్ ఒప్పందం అంటే లాకర్‌ యజమాని, బ్యాంకు మధ్య కుదుర్చుకున్న ఒప్పందం. బ్యాంకుకు, ఖాతాదారుడి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఖాతాదారుడు తనకు కేటాయించిన లాకర్‌లో అక్రమ వస్తువులను నిల్వ చేయకుండా లాకర్‌కు చెల్లించాల్సిన వార్షిక అద్దె చెల్లించడం వంటి ప్రాథమిక నిబంధనలను అంగీకరిస్తున్నట్లు ఒప్పందంలో సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కో బ్యాంకుకు ఒక్క పద్దతి ఉంటుంది. బ్యాంకు లాకర్‌ పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..