Bajaj FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రంగంలోకి బజాజ్‌ ఫైనాన్స్‌.. పెట్టుబడిదారులను ఆకర్షించేలా నమ్మలేని వడ్డీ ఆఫర్‌

ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది స్థిరమైన వడ్డీ రేటుతో స్థిరమైన పదవీకాల వ్యవధిలో ఒకే మొత్తాన్ని పెంచుకునే సాధనం. వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకుకు మారుతూ ఉంటాయి. లాకర్ లోపల డబ్బును ఉంచే బదులు ఎఫ్‌డీ చేస్తే మీకు మంచి వడ్డీ రేటు లభిస్తుంది. అయితే తాజాగా  ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ కొత్త డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రారంభించింది. అంతేకాకుండా ఆయా ఎఫ్‌డీ పెట్టుబడులపై నమ్మలేని వడ్డీను ఆఫర్‌ చేస్తుంది.

Bajaj FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రంగంలోకి బజాజ్‌ ఫైనాన్స్‌.. పెట్టుబడిదారులను ఆకర్షించేలా నమ్మలేని వడ్డీ ఆఫర్‌
Fixed Deposit
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 08, 2024 | 1:28 PM

భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు పెట్టుబడి ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రోజుల్లో ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బంగారం, రియల్ ఎస్టేట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (ఎఫ్‌డి) పెట్టుబడి పెడుతున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రముఖ మార్గంగా మారాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది స్థిరమైన వడ్డీ రేటుతో స్థిరమైన పదవీకాల వ్యవధిలో ఒకే మొత్తాన్ని పెంచుకునే సాధనం. వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకుకు మారుతూ ఉంటాయి. లాకర్ లోపల డబ్బును ఉంచే బదులు ఎఫ్‌డీ చేస్తే మీకు మంచి వడ్డీ రేటు లభిస్తుంది. అయితే తాజాగా  ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ కొత్త డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రారంభించింది. అంతేకాకుండా ఆయా ఎఫ్‌డీ పెట్టుబడులపై నమ్మలేని వడ్డీను ఆఫర్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో బజాజ్‌ ఫైనాన్స్‌ ఎఫ్‌డీలపై అందించే వడ్డీ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఇటీవల వెల్లడైన పలు నివేదికల ప్రకారం సీనియర్ సిటిజన్‌లు బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా చెల్లిస్తే 42 నెలల కాలానికి ఎఫ్‌డీలపై కంపెనీ వారికి సంవత్సరానికి 8.85 శాతం వరకూ వడ్డీని అందిస్తుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు తమ డబ్బును డిజిటల్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి 8.60 వరకు వడ్డీ రేటును అందుకుంటారు. ఈ పథకం జనవరి 2, 2023 నుంచి అమలులోకి వచ్చింది.

బజాజ్‌ ఫైనాన్స్‌ ఎఫ్‌డీలపై బజాజ్ ఫైనాన్స్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్‌గా ఉన్న సచిన్ సిక్కా మాట్లాడుతూ బజాజ్‌ ఫైనాన్స్‌ ఎఫ్‌డీ ఆఫర్ ఇప్పుడు డిపాజిటర్లు డిజిటల్‌గా ఆలోచించేలా చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌తో పాటు వెబ్ ద్వారా ముఖ్యంగా ఎఫ్‌డీలను అధిక వడ్డీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు.  బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌లోని ఎఫ్‌డీ కాలిక్యులేటర్ ప్రకారం ఎవరైనా రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 42 నెలల పాటు సంవత్సరానికి 8.60 శాతంగా ఉంటుంది. దీని తర్వాత వారికి రూ. 1,30,100 మెచ్యూరిటీ సొమ్ముగా అందిస్తారు. అంటే రూ.లక్షపై రూ.30,100 రాబడి వచ్చింది. అలాగే ఈ ఎఫ్‌డీలో సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడినవారు) మెచ్యూరిటీపై 8.85 శాతం చొప్పున రూ.1,30,975 పొందుతారని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..