AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా.. ఎలాగో తెలుసా..

ప్రస్తుతం యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు నగదు అవసరమవుతుంటుంది. ఏటీఎం ల నుండి నగదు విత్ డ్రా చేయాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. డెబిట్‌ కార్డు ఇంట్లో మరిచిపోయినా.. కార్డు లేకపోయినా..? డోంట్‌ వర్రీ.. ఏటీఎం డెబిట్ కార్డు లేకపోయినా చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది.

డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా.. ఎలాగో తెలుసా..
Money Spot ATM Franchise
M Revan Reddy
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 14, 2025 | 9:18 AM

Share

అందుబాటులో డెబిట్ కార్డు లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది. గతంలో నగదు కోసం బ్యాంకులకు వెళ్లి ఖాతా నుంచి విత్ డ్రా చేసుకునే వాళ్ళు.. ఆధునిక టెక్నాలజీ సహాయంతో నగదు విత్ డ్రా కోసం బ్యాంకర్లు ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. పదేళ్ల క్రితం వరకు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో ఏటీఎం దగ్గరి వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స్ (యూపీఐ) డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది లావాదేవీలను ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. అయినా.. ఒక్కోసారి నగదు అవసరం రావచ్చు. ఆ సమయంలో ఏటీఎంకు వెళ్లి డెబిట్ క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. అయితే డెబిట్ కార్డు అందుబాటులో లేకపోతే మాత్రం క్యాష్ విత్ డ్రా చేసుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఆర్బిఐ వినియోగదారులకు కొత్త అవకాశాన్ని కల్పించింది. డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం వద్దకెళ్లి మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.

యూపీఐ ఫీచర్‌ ద్వారా క్యాష్‌ విత్‌ డ్రాకు అవకాశం..

ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఆర్బిఐ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీలు పూర్తి చేయొచ్చు. మొబైల్ యాప్స్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల సాయంతో డెబిట్ కార్డు లేకున్నా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా డెబిట్ కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీల కోసం.. తొలుత ఏటీఎం స్క్రీన్‌పై యూపీఐ కార్డ్‌లెస్‌ క్యాష్‌ ఆప్షన్‌న్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్ డ్రా సెక్షన్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే తాత్కాలిక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఫోన్‌లోని బ్యాంకు యూపీఐ ఆధారిత యాప్‌తో దాన్ని స్కాన్‌ చేయాలి. యూపీఐ పిన్‌ను యాప్‌లో ఎంటర్‌ చేయాలి. ఆతరువాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. నగదు విత్‌డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ కూడా వస్తుంది.

యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా లావాదేవీలపై రోజుకు కొన్నింటిపై కొన్ని బ్యాంకులు పరిమితులు విధించాయి. యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా లావాదేవీల ఏటీఎంను భువనగిరి పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. హితాచీ మనీస్పాట్‌ ఏటీఎం పేరుతో జగదేవ్‌పూర్‌ రోడ్డులో ఆవిష్కరించారు. క్రమంగా వీటిని రద్దీ ఏరియాలు, టూరిస్ట్ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..