AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrit Bharat Trains: దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 50 కొత్త అమృత్ భారత్ రైళ్ల ఆమోదానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. డిసెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభించిన అమృత్ భారత్ రైళ్లకు విశేష స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమృత్ భారత్ రైలును 'మేక్ ఇన్ ఇండియా' కింద ప్రభుత్వం నిర్మించింది..

Amrit Bharat Trains: దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్
Amrit Bharat Trains
Subhash Goud
|

Updated on: Feb 20, 2024 | 9:30 PM

Share

ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఇటీవలే రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. వీటిలో మొదటి రైళ్లు దర్భంగా-అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడిచాయి. రెండవ రైలు మాల్దా టౌన్-సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినస్ (బెంగళూరు) మధ్య నడిచింది. ఈ రెండు రైళ్లను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత 50 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 50 కొత్త అమృత్ భారత్ రైళ్ల ఆమోదానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. డిసెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభించిన అమృత్ భారత్ రైళ్లకు విశేష స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమృత్ భారత్ రైలును ‘మేక్ ఇన్ ఇండియా’ కింద ప్రభుత్వం నిర్మించింది. ఇది భారతీయ రైల్వే ఆధునిక రైలు. సామాన్యుల సౌకర్యార్థం ఈ రైలును ఇటీవల ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

అమృత్ భారత్ రైలు ప్రత్యేకతలు:

ఈ నాన్-ఎసి రైలులో సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్, స్లీపర్ కోచ్‌లు ఉన్నాయి. ఇరువైపులా 6,000 hp WAP5 లోకోమోటివ్‌లతో రైలు 130 kmph వేగంతో పరుగెత్తగలదు. లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) పుష్-పుల్ డిజైన్‌తో కూడిన హై స్పీడ్ రైలు అయినందున ఈ రైలులో రెండు ఇంజన్‌లు అమర్చబడ్డాయి. రైలు ముందు భాగంలో అమర్చిన ఇంజన్ రైలును ముందుకు లాగుతుంది. వెనుక ఇంజన్ రైలు ముందుకు కదలడానికి సహాయపడుతుంది. పుష్-పుల్ సెటప్ ప్రయోజనాలను వివరిస్తూ, అశ్విని వైష్ణవ్ పుల్ అండ్ టర్న్‌లో రెండు ఇంజన్‌లను కలిగి ఉండటం సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.

అమృత్ భారత్ రైలు సెమీ-కప్లర్ టెక్నాలజీపై ఆధారపడింది. రైలు స్టార్టింగ్, స్టాపింగ్ సమయంలో కలిగే షాక్‌ల ప్రభావాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత సహాయపడుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ సౌకర్యాలు కల్పించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి