AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CNG Car Maintenance: అధిక మైలేజీ రావాలంటే ఈ టిప్స్ పాటించండి.. CNG కారు ఓనర్లకు ప్రత్యేక టిప్స్..

అయితే ఏ వాహనం అయినా మెయింటెనెన్స్ తప్పనిసరి. అలాగే సీఎన్జీ వాహనానికి కూడా సక్రమమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. అది సరిగ్గా ఉంటేనే కారు మైలేజీ బాగా వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎన్జీ కారు మైలేజీ ఎక్కువ రావడానికి మీరు తీసుకోవాలని చర్యలకు వివరిస్తున్నాం. మీకు ఒకవేళ సీఎన్జీ కారు కొనుగోలు చేయాలనుకున్నా.. లేక ఇప్పటికే సీఎన్జీ కారు కలిగి ఉన్నా కూడా ఈ టిప్స్ మీకు ఉపయోపడతాయి.

CNG Car Maintenance: అధిక మైలేజీ రావాలంటే ఈ టిప్స్ పాటించండి.. CNG కారు ఓనర్లకు ప్రత్యేక టిప్స్..
Cng Car
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 25, 2023 | 11:39 AM

Share

మన దేశంలో పర్యావరణ హిత వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఒక విద్యుత్ వాహనాలు, మరోవైపు సీఎన్జీ వాహనాలు క్రమంగా సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలను భర్తీ చేస్తున్నాయి. అయితే విద్యుత్ వాహనాల్లో బ్యాటరీల సామర్థ్యం తక్కువగా ఉండటం, రీచార్జ్ టైం, ధరలు ఎక్కువగా ఉండటంలో ఎక్కువగా సీఎన్జీ వైపు వినియోగదారుల మొగ్గుచూపుతున్నారు. మరోవైపు పెట్రోల్, సీఎన్జీ రెండూ టూ ఇన్ వన్ వెర్షన్ కావడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. అయితే ఏ వాహనం అయినా మెయింటెనెన్స్ తప్పనిసరి. అలాగే సీఎన్జీ వాహనానికి కూడా సక్రమమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. అది సరిగ్గా ఉంటేనే కారు మైలేజీ బాగా వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎన్జీ కారు మైలేజీ ఎక్కువ రావడానికి మీరు తీసుకోవాలని చర్యలకు వివరిస్తున్నాం. మీకు ఒకవేళ సీఎన్జీ కారు కొనుగోలు చేయాలనుకున్నా.. లేక ఇప్పటికే సీఎన్జీ కారు కలిగి ఉన్నా కూడా ఈ టిప్స్ మీకు ఉపయోపడతాయి.

టైర్లలో గాలి.. ఏ కారుకైనా మైలేజీ బాగా రావాలంటే దాని టైర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి. దానిలో గాలి సరిపడినంత వరకూ ఉండేలా చూసుకోవాలి. గాలి తక్కువ ఉంటే ఎక్కువ ఇంధనాన్ని హరిస్తుంది.

అనవసర సమయాల్లో ఇంజిన్ ఆఫ్.. మీరు కారును పార్క్ చేసిన సమయంలో లేదా ఎక్కువ సమయం ట్రాఫిక్ లో నిలిపి ఉన్న సమయంలో కారు ఇంజిన్ ను నిలిపివేయాలి. లేకుంటే అనవసరంగా ఇంధనం ఖర్చవుతుంది.

ఇవి కూడా చదవండి

అధిక బరువు వద్దు.. కారులో ఎక్కువ బరువు వేయొద్దు. కారులో నుంచి అనవసరమైన వస్తువులను తీసివేయండి. అదనపు బరువు ఇంజిన్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఎయిర్ ఫిల్టర్, క్లచ్ పరిస్థితి.. మీ సీఎన్జీ కారు తయారీదారు సిఫార్సు చేసిన నిర్వహణ షెడ్యూల్‌ను అనుసరించండి. ఎయిర్ ఫిల్టర్ క్రమం తప్పకుండా శుభ్రం చేయించండి. అవసరమైనప్పుడు మార్చండి. అలాగే అరిగిపోయిన క్లచ్ కూడా మైలేజీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి క్లచ్ సరిగ్గా పని చేస్తుందని నిర్ధారించుకోండి.

తగిన స్పార్క్ ప్లగ్‌.. మీ సీఎన్జీ వాహనంలో తగిన స్పార్క్ ప్లగ్‌లు ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోవడం చాలా అవసరం. సీఎన్జీ స్పార్క్ ప్లగ్‌లు స్పార్క్ సోర్స్, ప్లగ్ మెటాలిక్ టిప్ మధ్య తక్కువ గ్యాప్‌ని కలిగి ఉంటాయి. సీఎన్జీ అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పార్క్ ప్లగ్‌ని ఎంచుకోవడం మంచిది.

సీఎన్జీ సిస్టమ్‌ మోనిటరింగ్.. మీ సీఎన్జీ కారులో గ్యాస్ సిస్టమ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించండి. లీక్‌లు లేదా పనిచేయకపోవడం వంటి ఏవైనా సమస్యలను గమనించినట్లయితే, వెంటనే అర్హత కలిగిన సాంకేతిక నిపుణుడి ద్వారా దాన్ని తనిఖీ చేసి, మరమ్మతులు చేయించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..