AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold and Silver Latest Prices: వివాహాది శుభకార్యాలు, పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. అయితే, కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price Today
Shaik Madar Saheb
|

Updated on: Nov 25, 2023 | 6:21 AM

Share

Gold and Silver Latest Prices: వివాహాది శుభకార్యాలు, పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. అయితే, కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం (నవంబర్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,970 గా ఉంది. వెండి కిలో ధర రూ. 76,200 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,120 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,500, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,970 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,200 గా ఉంది. ముంబైలో రూ.76,200 ఉండగా.. చెన్నైలో రూ.79,200, బెంగళూరులో రూ.75,250 ఉంది. కేరళలో రూ.79,200, కోల్‌కతాలో రూ.76,200 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,200, విజయవాడలో రూ.79,200, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,200 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రామాయణంపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందువుల ఆగ్రహం
రామాయణంపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందువుల ఆగ్రహం
ఈ 5 పనులు 21 రోజులు చేస్తే.. మీరు లైఫ్ డ్రీమ్ తప్పక నెరవేరుతుంది
ఈ 5 పనులు 21 రోజులు చేస్తే.. మీరు లైఫ్ డ్రీమ్ తప్పక నెరవేరుతుంది
ఆధార్‌ ఉన్న వారు ఇది తెలుసుకోవాల్సిందే.. ఇక మరింత సులభం!
ఆధార్‌ ఉన్న వారు ఇది తెలుసుకోవాల్సిందే.. ఇక మరింత సులభం!
భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
పచ్చి ఉల్లి రోజూ తింటే కలరా, డయాబెటీస్‌, కిడ్నీ వ్యాధులతో సహా..
పచ్చి ఉల్లి రోజూ తింటే కలరా, డయాబెటీస్‌, కిడ్నీ వ్యాధులతో సహా..
స్టార్ హీరో మరణం తర్వాత దొరికిన 64 సూట్‌కేసులు.. లోపల చూసి..
స్టార్ హీరో మరణం తర్వాత దొరికిన 64 సూట్‌కేసులు.. లోపల చూసి..
కేవలం 50 రూపాయలతో.. రోజంతా హెల్తీ డైట్ ప్లాన్ మీ కోసం 
కేవలం 50 రూపాయలతో.. రోజంతా హెల్తీ డైట్ ప్లాన్ మీ కోసం 
టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు..
టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు..
ఒకేరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటన!
ఒకేరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటన!
అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ మిస్సైన జబర్దస్త్ కమెడియన్..
అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ మిస్సైన జబర్దస్త్ కమెడియన్..