Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holding Companies: హోల్డింగ్ కంపెనీలు అంటే ఏమిటి.. అందులో పెట్టుబడి పెట్టడం లాభమా.. నష్టమా..

గణేష్ ఇటీవల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అతను కొత్త షేర్లకు సంబంధించిన విషయాలను పరిశీలించడం..

Holding Companies: హోల్డింగ్ కంపెనీలు అంటే ఏమిటి.. అందులో పెట్టుబడి పెట్టడం లాభమా.. నష్టమా..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 27, 2022 | 6:29 AM

గణేష్ ఇటీవల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అతను కొత్త షేర్లకు సంబంధించిన విషయాలను పరిశీలించడం.. కంపెనీల అకౌంటింగ్ బుక్స్ అర్ధం చేసుకోవడంతో బిజీగా ఉన్నాడు. ఈలోగా ఒకరోజు అతని స్నేహితుడు హోల్డింగ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇచ్చాడు. హోల్డింగ్ కంపెనీల షేర్లు చాలా తక్కువలో దొరుకుతాయి. అదేవిధంగా వాటిపై డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో గణేష్ హ్యాపీగా ఫిలయ్యాడు. మీకు కూడా ఇదేదో బాగానే ఉందే అని అనిపించవచ్చు. అయితే,నిజంగా హోల్డింగ్ కంపెనీల నుంచి డబ్బు సంపాదించడం సాధ్యమేనా? ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ముందు హోల్డింగ్ కంపెనీ అంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలిద్దాం. కొన్ని కంపెనీలు ఇతర గ్రూప్ కంపెనీలలో కొద్దిపాటి వాటాలను కలిగి ఉంటాయి. అంటే తమకు సొంతంగా వ్యాపారాలు లేకపోయినా.. ఇతర కంపెనీలకు సంబంధించిన వాటాలను కొనుగోలు చేసి తమకోసం ఉంచుకుంటాయి. అందుకే ఈ కంపెనీలను హోల్డింగ్ కంపెనీలు అంటారు. ఇటువంటి హోల్డింగ్ కంపెనీల్లో పెట్టుబడి నిజంగా అధిక రాబడి ఇస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం..

హోల్డింగ్ కంపెనీలు ఇతర గ్రూప్ కంపెనీలలో వాటాలను నియంత్రిస్తాయి. కొన్నిసార్లు అవి మైనారిటీ వాటాలు మాత్రమే కలిగి ఉంటాయి. హోల్డింగ్ కంపెనీలకు వారి సొంత వ్యాపారం ఉండదు. ఇవి కేవలం ఇతర గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. టాటా సన్స్ కంపెనీ ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. కొన్ని హోల్డింగ్ కంపెనీలు ఇతర కంపెనీలలో పెట్టుబడి పెట్టడమే కాకుండా వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంటాయి. దీనికి HDFC లిమిటెడ్ ఉదాహరణగా తీసుకోవచ్చు. హోల్డింగ్ కంపెనీలు ఇతర గ్రూప్ కంపెనీలలో ఉన్న వాటాల నుంచి విలువను పొందుతాయి. ఇతర గ్రూపు కంపెనీల పెర్ఫార్మెన్స్ ఆధారంగా హోల్డింగ్ కంపెనీల విలువ నిర్ణయిస్తారు.

మనదేశంలో ఉన్న కొన్ని హోల్డింగ్ కంపెనీలు ఉన్నాయి. JSW హోల్డింగ్ అనేది ఒక NBFC, JSW గ్రూప్ కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. అదేవిధంగా బజాజ్ హోల్డింగ్,పెట్టుబడి, పిలానీ ఇన్వెస్ట్‌మెంట్, STEL హోల్డింగ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, మాక్స్ ఇండియా వంటివి హోల్డింగ్ కంపెనీలుగా ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీ చౌకగా ఉందా లేదా అని లెక్కించడానికి ఎటువంటి సూత్రం లేదు. ఇదంతా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌కు సంబంధించినదిగా ఉంటుంది. హోల్డింగ్ కంపెనీలు తక్కువ వాల్యుయేషన్‌లో లభిస్తాయి. హోల్డింగ్ కంపెనీల షేర్లు సాధారణంగా పెట్టుబడి పెట్టిన కంపెనీల కంటే తక్కువ వాల్యుయేషన్‌లో లభిస్తాయి. ఆస్తులు విలువతో పోల్చినప్పుడు ఇవి కూడా తక్కువ విలువను కలిగి ఉంటాయి.

ప్రమోటర్లు సాధారణంగా తమ కంపెనీల షేర్లను విక్రయించరు. ఒకవేళ వాటిని విక్రయిస్తే, కంపెనీ షేర్ల ధరలు పడిపోవచ్చు కాబట్టి ప్రమోటర్లు షేర్లను విక్రయించరు. అందువల్ల హోల్డింగ్ కంపెనీల షేర్ విలువను కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు. అందుకే ఈ స్టాక్‌లు ఎల్లప్పుడూ తక్కువ ధరలో ఉంటాయి. అంతేకాదు.. ఈ షేర్ల బదిలీపై విధించే పన్నులు కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు గణేష్‌కు హోల్డింగ్ కంపెనీల గురించి అర్థమైంది.

Read Also.. PF Account: మీకు పీఎఫ్‌ అకౌంట్ ఉందా.. అయితే వెంటనే నామినీని యాడ్ చేయండి..