AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car safety: ఫైవ్ స్టార్ రేటింగ్ కార్లు సురక్షితమేనా..? సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు

కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. బ్రాండ్, మైలేజీ, రంగు, నాణ్యత, పనితీరును పరిశీలిస్తారు. వీటినన్నింటినీ గమనించి, ఇప్పుటికే ఆ కారు వినియోగిస్తున్న వారి అభిప్రాయం తీసుకుని ముందడుగు వేస్తారు. ఇప్పుడు కొత్తగా భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Car safety: ఫైవ్ స్టార్ రేటింగ్ కార్లు సురక్షితమేనా..? సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
Cars 5 Star Rating
Nikhil
|

Updated on: Nov 14, 2024 | 4:28 PM

Share

ముఖ్యంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తయారీ దారులు న్యూ కార్ అసెసెమెంట్ రేటింగ్ (ఎన్సీఏపీ) కార్లను విడుదల చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి కార్లలోని ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కార్లలోని ప్రయాణికులు వంద శాతం సురక్షితంగా ఉంటారని చెప్పలేము. ఎందుకంటే కార్ల తయారీ కంపెనీలు చేసే టెస్టులకు, బయట జరిగే ప్రమాదాల తీవ్రతకు మధ్య అనేక తేడాలు ఉంటాయి. ప్రయాణం సమయంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు కారులోకి వారికి అయ్యే గాయాల తీవ్రతకు అంచనా వేయడానికి క్రాష్ టెస్ట్ చేస్తారు. ఇందుకోసం కారులో పెద్దలు, పిల్లల ఆకారంలో బొమ్మలు ఏర్పాటు చేస్తారు. వాటి తల, కాళ్లు, చేతులు, గుండె తదితర ప్రదేశాల్లో సెన్సార్లు అమర్చుతారు. ఈ కారును ఇతర వాహనాలతో ఢీకొట్టిస్తారు. అప్పుడు కారులోని డమ్మీ బొమ్మలకు అయ్యే గాయాల తీవ్రతను సెన్సార్ ద్వారా గుర్తించి రేటింగ్ ఇస్తారు. ఇటీవల విడులైన మారుతీ సుజకీ డిజైర్ గ్లోబరల్ ఎన్ సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ నమోదు చేసింది. ఈ ఘనత సాధించిన మొదటి కారుగా పేరు పొందింది.

గమనించాల్సిన అంశాలు

  • క్రాష్ పరీక్షలు కార్ల కంపెనీలలోని నిర్ణీత ప్రదేశంలో జరుగుతాయి. కానీ బయట రోడ్లపై వాతావరణం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎన్ సీఏపీ రేటింగ్ బట్టి కారును పూర్తిగా సురక్షితమైనదని చెప్పలేము.
  • వాహనాలు ఢీకొన్న వేగాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది. సాధారణంగా క్రాష్ పరీక్షల సమయంలో ఫ్రంట్ ఇంపాక్ట్ కోసం 60 కేఎంపీహెచ్, సైడ్ ఇంపాక్ట్ ల కోసం 30 కేఎంపీహెచ్ వేగంతో ఢీకొట్టిస్తారు. కానీ రోడ్లపై ప్రయాణ సమయంలో అంతకంటే ఎక్కువ వేగంగా వచ్చిన వాహనాలు ఢీకొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా నష్టం అంచనాపై తేడా ఉంటుంది.
  • తక్కువ ఎత్తున్న కారును ఎక్కువ ఎత్తుగల వాహనం ఢీకొనప్పుడు, తక్కువ బరువున్నకారును ఎక్కువ బరువున్న వాహనం ఢీకొన్నప్పుడు, ఒకే కారును రెండు కార్లు ఢీకొన్నప్పుడు జరిగే నష్టాల విషయంలో తేడా ఉంటుంది. కార్ల తయారీదారులు చేసిన పరీక్షల సమయంలో ఇంత నష్టం జరిగే అవకాశం ఉండదు.
  • ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న కారు నడుపుతున్నప్పటికీ మానవ తప్పిదాల కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరగొచ్చు.
  • ఆధునిక కార్లలో అనేక కొత్త భద్రతా ఫీచర్లు ఉంటాయి. వీటిపై కార్ల యజమానులు, డైవర్లకు అవగాహన ఉండకపోవచ్చు.
  • నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించడకపోవడం వల్ల ప్రమాాదాలు జరుగుతాయి. వాటి వల్ల కలిగే నష్టాలను అంచనా వేయలేం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..