Jack Ma: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ‘జాక్ మా’కు ఎదురు దెబ్బ.. మరో కంపెనీ చేజారింది

ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న జాక్ మాకు మొదలైన కష్టాల కాలం ఇంకా తీరలేదు. అతను అదృశ్యమయ్యాడని చాలా కాలంగా..

Jack Ma: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న 'జాక్ మా'కు ఎదురు దెబ్బ.. మరో కంపెనీ చేజారింది
Jack Ma
Follow us
Subhash Goud

|

Updated on: Jan 07, 2023 | 1:51 PM

ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న జాక్ మాకు మొదలైన కష్టాల కాలం ఇంకా తీరలేదు. అతను అదృశ్యమయ్యాడని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. అయితే అతను జపాన్‌లో నివసిస్తున్నట్లు 2 నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు జాక్‌మాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా తన సొంత కంపెనీపై నియంత్రణ కోల్పోయాడు. ఇప్పుడు యాంట్ గ్రూప్‌లో అతని వాటా కేవలం 10 శాతానికి తగ్గింది. అలాగే నియంత్రణ హక్కులు కూడా ముగియనున్నాయి. దీంతో అతనికి పెద్ద దెబ్బేనని చెప్పాలి. అయితే ఇక నుంచి ఫిన్‌టెక్‌ దిగ్గజం యాంట్‌ఫై జాక్‌మాకు ఎలాంటి నియంత్రణ ఉండదని సంబంధిత గ్రూప్‌ తెలిపింది. జాక్ మా నిష్క్రమణతో యాంట్ గ్రూప్‌లో ప్రైవేటు పెట్టుబడిదారుల ప్రభావం తగ్గతుంది.

2020 లో సమారు $37 బిలియన్ల యాంట్ గ్రూప్‌ను IPOకి తీసుకురావాలనుకున్నప్పటికి ఇది చివరి క్షణంలో రద్దయింది. బీజింగ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ BDA ఛైర్మన్ డంకన్ క్లార్క్ మాట్లాడుతూ.. జాక్ మా తన నియంత్రణను వదులుకోవడం ద్వారా కంపెనీ IPO కు మార్గం సులభం అయినప్పటికి, లిస్టింగ్ నిబంధనల కారణంగా ఇది మరింత ఆలస్యం కావచ్చని అన్నారు. చైనా దేశీయ స్టాక్ మార్కెట్‌లో నియంత్ర మార్పు తర్వాత కంపెనీలు లిస్ట్ కావడానికి మూడేళ్ళ పాటు సమయం పడుతుంది.

ఈ ఉదయం యాంట్ గ్రూప్ నుండి వెలువడిన ఒక ప్రకటన ప్రకారం.. చైనా బిలియనీర్, దిగ్గజం ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇకపై కంపెనీపై నియంత్రణను కలిగి ఉండరు. అంతేకాకుండా జాక్ మా కంపెనీలో ఎటువంటి హక్కులు ఉండని విధంగా తన షేర్ హోల్డింగ్ నిర్మాణాన్ని సర్దుబాటు చేసింది. గ్రూప్ వాటాదారులు అటువంటి సర్దుబాటుకు అంగీకరించారని, ఆ తర్వాత జాక్ మా అన్ని ఓటింగ్ హక్కులు ముగుస్తున్నాయని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

జాక్ మా అత్యంత విలువైన ఆస్తి అతని చేతుల్లో నుండి పోయిందని ధృవీకరించింది. యాంట్ గ్రూప్ షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్‌లో మార్పు అంటే ఇది ఇప్పటికే సుదీర్ఘ నిరీక్షణలో ఉన్న దాని IPO కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. 2021 సంవత్సరంలో యాంట్ కంపెనీ బ్లాక్‌బస్టర్ $ 37 బిలియన్ల IPOని చైనా ప్రభుత్వం నిషేధించింది. అలాగే నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన పేరుతో అలీబాబా కంపెనీపై రికార్డు స్థాయిలో $ 2.8 బిలియన్ జరిమానా విధించింది.

గతంలో ఫిన్‌టెక్ దిగ్గజం యాంట్‌‌లో జాక్ మా 50శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నారు. కానీ ప్రస్తుతం వాటా 6.2 శాతానికి పడిపోయింది.

జాక్ మా కష్టాలు ఎందుకు ఎప్పుడు మొదలయ్యాయి?

ఈ నేపథ్యంలో యాంట్ గ్రూప్ వాటాదారుల ఆర్థిక స్థితిని ప్రభావితం చేయనప్పటికీ, ఈ వార్త జాక్ మాక్‌మాకు ఎదురుదెబ్బే తగిలింది. కంపెనీలో అతని ఓటు హక్కు దాదాపు 50 శాతానికి పడిపోయింది. 6.5 శాతానికి వచ్చాయి. 2020లో చైనా ప్రభుత్వాన్ని విమర్శించడంతో జాక్ మా కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అతని నికర విలువ కూడా తగ్గింది.

చైనా ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత వేధింపులు:

2020లో చైనా విధానాలను జాక్ మా విమర్శించారు. చైనా ఆర్థిక నియంత్రణ వ్యవస్థను విమర్శిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకులను వడ్డీ వ్యాపారులతో పోల్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు పాన్ షాప్ మనస్తత్వం ఉందని ఆరోపించారు. అంతర్జాతీయ ఆర్థిక నియంత్రణ ఒప్పందం (బాసెల్ ఒప్పందాలు)పై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. అప్పటి నుండి అతను సృష్టించిన యాంట్, అలీబాబా కంపెనీలను చైనా ప్రభుత్వం వేధింపులు కొనసాగించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!