Amazon Summer Offers: అమెజాన్ బంపర్ ఆఫర్.. సమ్మర్ సేల్ పేరుతో ఏసీ, రిఫ్రిజిరేటర్లపై భారీగా డిస్కౌంట్లు..

Amazon Summer Offers: రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వినియోగదారుల...

Amazon Summer Offers: అమెజాన్ బంపర్ ఆఫర్.. సమ్మర్ సేల్ పేరుతో ఏసీ, రిఫ్రిజిరేటర్లపై భారీగా డిస్కౌంట్లు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 26, 2021 | 4:42 PM

Amazon Summer Offers: రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 26 నుంచి(నేటితో) ప్రారంభం కాగా, ఫిబ్రవరి 28వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. సమ్మర్ అప్లయన్స్ ఫెస్టివల్ పేరుతో వోల్టాస్, ఎల్జీ, డాకిన్, వర్ల్‌ఫూల్, శామ్సంగ్, సింఫనీ, గోద్రేజ్, కంపెనీలకు చెందిన బ్రాండ్లపై పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించింది. ఇది మాత్రమే కాదు.. కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు ద్వారా కొనుగోలు చేసినట్లయితే, EMI లపై 10 శాతం (రూ .1500 వరకు) అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.

ఎయిర్ కండీషనర్లలో టాప్ ఆఫర్లు ఇవే.. – వోల్టాస్, డాకిన్, ఎల్‌జి, వర్ల్‌పూల్, సాన్యో, ఇతర ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఎయిర్ కండీషనర్లపై 40% వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అయితే, ఈ బ్రాండ్ల ప్రారంభ ధర రూ .22,999 గా నిర్ణయించింది. – విండో ప్రారంభం ధర ధర 17,490. – గది పరిమాణం, విద్యుత్ వినియోగానికి అనుగుణంగా 0.75 టన్నుల నుండి 2 టన్నుల వరకు ఎసిల బ్రాండ్లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. – అమెజాన్ ఏసీ మోడళ్లను బట్టి వాటి బేసిక్ ప్రైస్‌ను రూ .22,499 గా నిర్ణయించింది. – ఎల్‌జి, వోల్టాస్, పానాసోనిక్, టిసిఎల్ వంటి ప్రథమ శ్రేణి బ్రాండ్లకు సంబంధించి ఎస్‌బిలు, స్మార్ట్ ఏసిలలో 50 కి పైగా కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసువకుచ్చింది. – టాప్ వోల్టాస్, ఎల్జీ, పానాసోనిక్, ఐఎఫ్‌బి వంటి బ్రాండ్లతో పాటు.. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తున్న మిడియా, హిస్సెన్స్, లివ్‌పోర్‌ వంటి కొత్త బ్రాండ్లను 80 కి పైగా అమ్మకానికి తీసుకువచ్చింది. – వోల్టాస్ ఎసి 1.4 టన్నుల విభాగంలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది.

రిఫ్రిజిరేటర్లలో టాప్ ఆఫర్లు ఇవే.. – ఎల్జీ, శామ్‌సంగ్, వర్ల్‌పూల్, హైయర్, గోద్రేజ్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల నుండి రిఫ్రిజిరేటర్లకు 35 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. – తక్కువ విద్యుత్ వినియోగం గల రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ .13,790 గా పేర్కొంది. – ఆ తరువాత శ్రేణి రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ .21,290 గా నిర్ణయించింది. – ఎక్సేంజ్‌పై రూ .12,000 వరకు రాయితీలు ఇస్తోంది. – రిఫ్రిజిరేటర్లలో 60 కి పైగా కొత్త బ్రాండ్‌లపై కనీసం 10 శాతం తగ్గింపునిస్తోంది. – వర్ల్‌పూల్, శామ్‌సంగ్, ఎల్‌జి, గోద్రేజ్, హైయర్ వంటి ప్రథమ శ్రేణి బ్రాండ్లలలోనూ కొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది.

కూలర్లు, యాక్సెసరీస్‌పై భారీగా రాయితీలు.. – సింఫనీ, క్రాంప్టన్, బజాజ్, హావెల్స్ టాప్ బ్రాండ్లపై 50% వరకు తగ్గింపునిస్తోంది. – ఓరియంట్ ఎలక్ట్రిక్, క్రాంప్టన్ మొదలైన ప్రధాన బ్రాండ్లను విక్రయానికి ఉంచింది. – ఎక్స్‌క్లూజివ్ డిజైనర్ సీలింగ్ ఫ్యాన్ లూమినస్‌ను సేల్‌కు పెట్టింది.

Also read:

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు

నా సినిమాలో హీరో నేను కాదు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన మంచువరబ్బాయి..