AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Pay: రూపే క్రెడిట్ కార్డుపైనా ఈఎంఐ ఆప్షన్.. ఇక షాపింగ్ ఏమాత్రం భారం కాదు..

రూపే క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నట్లు అమెజాన్ పే ప్రకటించింది. వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ ను మరింత సౌకర్యవంతంగా, అనువైనదిగా చేసేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ఈ డిజిటిల్ పేమెంట్స్ ప్లాట్ ఫారం అమెజాన్ తెలిపింది. రూపే క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఎనిమిది బ్యాంకులు అందిస్తున్నట్లు అమెజాన్ పే ప్రకటించింది.

Amazon Pay: రూపే క్రెడిట్ కార్డుపైనా ఈఎంఐ ఆప్షన్.. ఇక షాపింగ్ ఏమాత్రం భారం కాదు..
Amazon Sale
Madhu
|

Updated on: Oct 20, 2023 | 5:05 PM

Share

పండుగ సీజన్ పీక్స్ లో ఉంది. ఆఫర్ల జాతర కొనసాగుతోంది. అన్ని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ పలు రకాల డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ తన వినియోగదారులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అమెజాన్ పే నుంచి కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. రూపే క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నట్లు అమెజాన్ పే ప్రకటించింది. వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ ను మరింత సౌకర్యవంతంగా, అనువైనదిగా చేసేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ఈ డిజిటిల్ పేమెంట్స్ ప్లాట్ ఫారం అమెజాన్ తెలిపింది. రూపే క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఎనిమిది బ్యాంకులు అందిస్తున్నట్లు అమెజాన పే ప్రకటించింది. ఈ ఈఎంఐ సదుపాయంతో వినియోగదారులు ఫెస్టివ్ సీజన్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇబ్బంది లేకుండా చేస్తుందని కంపెనీ ప్రకటించింది.

బెస్ట్ ఆప్షన్ గా..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభమైన తొలి 48 గంటల్లో ఈ కొత్త ఈఎంఐ ఆప్షన్ అత్యధిక శాతం మంది ప్రిఫర్ చేసిన పేమెంట్ మోడ్ గా నిలిచిందని ప్రకటించింది. ప్రతి నాలుగు షాపింగ్ ఆర్డర్లలో ఒకటి ఈ అమెజాన్ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్ పైనే జరిగాయని పేర్కొంది. ఇక నోకాస్ట్ ఈఎంఐ అయితే ప్రతి నాలుగు ఈఎంఐ ఆర్డర్లపై మూడు దీనిపైనే జరిగాయని పేర్కొన్నారు. ఇది క్రమంగా మరింత పెరుగుతోందని వివరించింది.

అమెజాన్ పే క్రెడిట్ అండ్ లెండింగ్ డైరెక్టర్ మయాంక్ జెయిన్ మాట్లాడుతూ ఎన్పీసీఐతో కలిసి ఈ కొత్త విధానాన్ని తీసుకోచ్చామన్నారు. వినియోగదారులకు మెరుగైన క్రెడిట్ విధానాన్ని అందించేందుకు రూపే క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్లను తీసుకొచ్చినట్లు చెప్పారు. దీని సాయంతో బెస్ట్ ఇన్ క్లాస్ వాల్యూ, వినియోగదారులకు అత్యధిక సేవింగ్స్ వచ్చేలా ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ కొత్త ఈఎంఐ విధానం వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ ను మరింత దగ్గర చేస్తుందని, ముఖ్యంగా ఈ ఫెస్టివ్ సీజన్లో మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. కాగా అమెజాన్ పే ఇతర పేమెంట్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. అమెజాన్ పే లేటర్, అమెజాన్ పే వ్యాలెట్, యూపీఐ వంటి వాటి ద్వారా వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ ను మరింత సులభతం చేస్తుందని మయాంక్ జెయిన్ చెప్పుకొచ్చారు. ఇది వినియోగదారులకు ఏమాత్రం ఆర్థికభారం కాకుండా ఇంటుందని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..