Tata Electric Scooter: రూ.లక్ష ధర.. 200కి.మీ. రేంజ్.. వచ్చేస్తోంది టాటా ఈ-స్కూటర్..!
భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ను షేక్ చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. కంపెనీ నుంచి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూ వీలర్ ను లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని లాంచ్ డేట్, ధర, ఇతర ఫీచర్ల గురించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

భారతదేశం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి హబ్ గా ఎదిగింది. ప్రపంచంలోనే పెద్ద మార్కెట్లలో ఒకటిగా మన దేశం నిలబడుతోంది. అందుకే అన్ని పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు మన దేశంలో తమదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది కదా.. ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తూ మన దేశంలో రకరకాల కంపెనీలు, రకరకాల మోడళ్లను ఎలక్ట్రిక్ వేరియంట్ గా లాంచ్ చేస్తున్నాయి. విపరీతమైన పోటీ కంపెనీల మధ్య ఉంది. ఈ వార్ జోన్ లోకి భారతీయ అతి పెద్ద మోటార్ కంపెనీ టాటా వస్తోంది. టాటా కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతోంది. తన ముద్రను ద్విచక్ర వాహనాల శ్రేణిలో వేసేందుకు సమాయత్తమవుతోంది. ఇది ఏకంగా సింగిల్ చార్జ్ పై 200కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. టాటా మోటార్స్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అత్యాధునిక ఫీచర్లు..
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో టాటా మోటార్స్ ఇండియా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. అయితే కంపెనీ మాత్రం ఈ స్కూటర్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఆన్ లైన్ లో కొన్ని కీలక అంశాలు లీక్ అయ్యాయి. వాటి ప్రకారం.. ఈ స్కూటర్లో అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. రైడర్ వేగం, దూరం మరియు ప్రయాణ వివరాలను చూపించే పూర్తి డిజిటల్ డాష్‌బోర్డ్ ఉంది. రాత్రిపూట మంచి వ్యూయింగ్ కోసం ప్రకాశవంతమైన ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. డిజైన్‌లో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, అదనపు భద్రత కోసం వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
లాంగ్ రేంజ్ బ్యాటరీ..
ఈ స్కూటర్ నిజంగా ప్రత్యేకమైనది ఎందుకంటే దీనిలో శక్తివంతమైన లిథియం-అయాన్ 3.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళుతుంది. మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటే, మీరు కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల వలె ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు నగరంలో ఉన్నా లేదా హైవేపై డ్రైవింగ్ చేస్తున్నా, ఎలక్ట్రిక్ మోటారు మీకు వేగవంతమైన యాక్సెలరేషన్, సులభమైన రైడింగ్‌ను అందిస్తుంది.
అనువైన ధరలో..
టాటా ఇంకా అధికారికంగా ఈ స్కూటర్‌ను విడుదల చేయలేదు. కానీ కొన్ని ఆన్ లైన్ రిపోర్టుల ప్రకారం దీనిని 2025 ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ధర రూ. లక్ష నుంచి 1.2లక్షల వరకూ ఉండవచ్చని చెబుతున్నారు. ఇది ప్రధానంగా ఓలా ఎస్1 ప్రో, బజాజ్ చేతక్ వంటి వాటికి మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు, ఆఫీసులకు వెళ్లేవారికి లేదా పెట్రోల్ కోసం అధిక డబ్బు ఖర్చు వెచ్చించడం ఇష్టం లేని వారికి ఇది బెస్ట్ ఎంపికగా ఉంటుంది.