Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flat Buying: మీరు సొసైటీలో ప్లాట్ కొంటున్నారా..? పొరపాటున ఈ తప్పులు చేయకండి..!

Flat Buying: మీరు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ ధరను తనిఖీ చేయండి. చాలా సార్లు డీలర్లు తక్కువ ధరకు ఫ్లాట్లను ఎక్కువ ధరలకు అమ్ముతారు. అందుకే నగర అభివృద్ధి అథారిటీ నుండి ఫ్లాట్ ధరను తెలుసుకోండి. దీనితో మీరు మీ డబ్బును చాలా ఆదా చేసుకోవచ్చు. మొత్తం మీద మీరు సొసైటీలో ప్లాట్‌ కొంటే అన్ని విషయాలు..

Flat Buying: మీరు సొసైటీలో ప్లాట్ కొంటున్నారా..? పొరపాటున ఈ తప్పులు చేయకండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 02, 2025 | 3:32 PM

ఈ వేగవంతమైన జీవితంలో ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కొనాలని కోరుకుంటారు. కానీ చాలా మందికి ఈ కల ఒక కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే నేటి కాలంలో ఆస్తుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. అది కూడా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కొనడానికి కోట్ల రూపాయలు అవసరం. భూమి కంటే ఇల్లు ఖరీదైనది. అందుకే ప్రజలు ఫ్లాట్లు కొంటారు. ఇవి ప్లాట్లలోని ఇళ్ల కంటే చౌకైనవి. అందువల్ల మీరు ఒక కమ్యూనిటీలో ఫ్లాట్ కొంటుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. మీరు ఇలా చేయకపోతే, మీరు ఫ్లాట్‌లోకి వెళ్లిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొవచ్చు. మనం తప్పులను నివారించుకోవడానికి గుర్తుంచుకోవలసిన ఈ విషయాలు ఏమిటో తెలుసుకుందాం..

పేపర్ వర్క్:

మీరు ఒక ఫ్లాట్ కొంటుంటే అన్ని ఆస్తి పత్రాలు సరిగ్గా, పూర్తిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఫ్లాట్, సొసైటీ RERA నిబంధనల ప్రకారం నిర్మించబడిందా..? ఫ్లాట్ రిజిస్టర్ చేయబడిందా? డీలర్ రిజిస్టర్ చేయబడిందా? మొదలైన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలను ముందుగానే తనిఖీ చేయండి. లేకుంటే మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

బ్యాంకు రుణం:

సాధారణంగా ప్రజలు ఫ్లాట్ కొన్నప్పుడు కొద్ది మొత్తంలో డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తానికి లోన్ తీసుకుని నెల నెలా EMI రూపంలో చెల్లిస్తారు. అటువంటి పరిస్థితిలో రుణ పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఈఎంఐ ఎంత, వడ్డీ రేటు ఎక్కువగా ఉందా లేదా మొదలైనవి ముందుగానే తెలుసుకోండి.

రవాణా సదుపాయం:

మీరు ఒక ఫ్లాట్ కొన్నప్పుడు ముందుగా ఆ ప్రదేశం గురించి తనిఖీ చేయండి. మీరు ఆఫీసుకు వెళ్లాలి.. పిల్లలు స్కూల్‌కు వెళ్లాలి.. మార్కెట్‌కు వెళ్లాలి.. బస్సు, రైలు లేదా విమానంలో ఎక్కడికైనా వెళ్లాలి.. మెట్రో మొదలైనవన్నీ సమీపంలోనే ఉండేలా చూసుకోండి. మీ ఈ రవాణా సదుపాయం లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సమీపంలో రవాణా సౌకర్యం ఉండేలా తీసుకోవడం మంచిది. అలాగే మీ ఫ్లాట్ నుండి ఈ ప్రదేశాలకు చేరుకోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది. అలాగే ఆ ప్రాంతం సరైనదో కాదో బాగా అనే విషయాలను అర్థం చేసుకోండి.

ప్లాన్‌ ధర:

మీరు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ ధరను తనిఖీ చేయండి. చాలా సార్లు డీలర్లు తక్కువ ధరకు ఫ్లాట్లను ఎక్కువ ధరలకు అమ్ముతారు. అందుకే నగర అభివృద్ధి అథారిటీ నుండి ఫ్లాట్ ధరను తెలుసుకోండి. దీనితో మీరు మీ డబ్బును చాలా ఆదా చేసుకోవచ్చు. మొత్తం మీద మీరు సొసైటీలో ప్లాట్‌ కొంటే అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీసుకోవడం మంచిది. ప్లానింగ్‌ లేకుండా చేసే పొరపాట్ల కారణంగా తర్వాత మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ప్లాన్‌ కొనే ముందు సంబంధిత నిపుణులు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మీరు తీసుకునే ప్లాట్‌ సరైనదేని కాదా అని తెలుసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి