Maruti Suzuki EV: క్యూ కట్టనున్న మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కార్లు.. లక్ష్యం ఇదేనంటున్న ఆ సంస్థ సీఈఓ..
ఇప్పటికే టాటా వంటి సంస్థలు ఈ సెగ్మెంట్లో దూసుకుపోతుంటే.. సుజుకీ నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఎలక్ట్రిక్ కారు కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే ఆ వెయిటింగ్ కు ఇక మారుతి సుజుకీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆసన్నమైంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ ఈవీని త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది.
మన దేశంలో పెట్రోల్, డీజిల్ కార్లలో అగ్రగామి మారుతి సుజుకీ. అత్యధిక విక్రయాలు చేస్తున్న కార్ల జాబితాలో టాప్ టెన్లో ఈ కంపెనీకి చెందిన కార్లే ఉంటాయి. మరి అలాంటి సంస్థ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో మాత్రం కాస్త వెనక బడింది. ఇప్పటికే టాటా వంటి సంస్థలు ఈ సెగ్మెంట్లో దూసుకుపోతుంటే.. సుజుకీ నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఎలక్ట్రిక్ కారు కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే ఆ వెయిటింగ్ కు ఇక మారుతి సుజుకీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆసన్నమైంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ ఈవీని త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి సెప్టెంబర్ పదో తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని నిర్ధారించారు. 2030 నాటికి ఎగుమతులను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కొత్తగా రానున్న ఈ కొత్త ఈవీలో 60కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుందని.. ఇది 500కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆయన చెప్పారు.
సీఈఓ చెప్పిన వివరాలు..
మారుతీ సుజుకీ సీఈఓ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సియామ్(SIAM)64వ వార్షిక సెషన్లో ఆయన మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. తాము 500 కి.మీల హై రేంజ్ తో కూడిన అధిక-స్పెసిఫికేషన్ ఈవీని కలిగి తీసుకొస్తున్నట్లు చెప్పారు. 60 కిలోవాట్-అవర్ బ్యాటరీతో శక్తిని కలిగి ఉంటుందని చెప్పారు. కస్టమర్ విశ్వాసాన్ని పెంపొందించుకోడానకి ఇదే ఈవీలను భారత దేశంతో పాటు యూరోప్, జపాన్ వంటి మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న ఆందోళనలను తొలగించడానికి అనేక పరిష్కారాలను తాము అందిస్తున్నామని చెప్పారు. తమ బలమైన నెట్ వర్క్ ద్వారా వినియోగదారులకు మంచి సర్వీస్ ను అందిస్తామని ఆయన నొక్కి చెప్పారు.
పర్యావరణ హితానికి..
దేశీయ విపణిలో, కార్బన్ ఉద్గారాలను ఎదుర్కోడానికి మారుతి తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని చూస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతో పాటు, ఆటోమేకర్ బయో-ఇంధనాలు, హైడ్రోజన్ లతో కూడిన మోడళ్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. చమురు వినియోగం, సీఓ2 ఉద్గారాలను తగ్గించడానికి హైడ్రోజన్, బలమైన హైబ్రిడ్‌లు, జీవ ఇంధనాలు వంటివి బాగా ఉపకరిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..