ట్రాయ్ పేరు చెప్పి జియో దెబ్బ.. కొత్త టారిఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
జియో… అన్ని ఇతర నెట్‌వర్స్‌కు ఉచితంగా కాల్స్, అపరిమిత ఇంటర్నెట్.. ఈ రెండింటితో అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులకు దగ్గర అయ్యింది. అయితే మొన్నటి వరకు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్స్‌కు అంతా ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చింది జియో. ఇక ఉచితంగా ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్ చేసుకునే సదుపాయానికి చెక్ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 […]
జియో… అన్ని ఇతర నెట్‌వర్స్‌కు ఉచితంగా కాల్స్, అపరిమిత ఇంటర్నెట్.. ఈ రెండింటితో అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులకు దగ్గర అయ్యింది. అయితే మొన్నటి వరకు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్స్‌కు అంతా ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చింది జియో. ఇక ఉచితంగా ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్ చేసుకునే సదుపాయానికి చెక్ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్టు రెండు రోజుల క్రితం పేర్కొంది. గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయాలంటే తక్కువలో తక్కువ పది రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందంటూ కొన్ని టాపప్ ఓచర్లను కూడా ప్రవేశపెట్టింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లో భాగంగా వీటిని వసూలు చేయక తప్పడం లేదని పేర్కొంది. అయితే తొలుత ప్రకటనలో ట్రాయ్ ఒత్తిడి మేరకే చేస్తున్నట్లు ప్రకటించినా.. దీనిని ట్రాయ్ తప్పుబట్టింది. అయితే ఇప్పటి వరకు ఐయూసీ ఛార్జీలను జియోనే కట్టింది.
అయితే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి చేయించుకునే ప్రతీ పది రూపాయల టాపప్‌పై అదనంగా ఒక జీబీ డేటా ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు తరచూ కాల్ చేసే ఖాతాదారులు టాపప్‌లు చేయించుకుంటున్నారు. అయితే, జియో తాజాగా కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అక్టోబరు 9వ తేదీకి ముందు రీచార్జ్ చేసుకున్న ఖాతాదారులకు టాపప్ రీచార్జ్‌తో పనిలేదని ప్రకటించింది. వారంతా ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, వారంతా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. వారి ప్లాన్ గడువు తేదీ ముగిసే వరకు ఇది వర్తిస్తుందని, ఆ తర్వాత మాత్రం ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
జియో ఐయూసీ మినట్స్ టాప్ అప్ వోచర్స్ ఇవే..
రూ.10తో చేసుకుంటే.. 124 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్ కాల్స్ చేసుకునేందుకు ) -1జీబీ డాటా ఉచితం రూ.20తో చేసుకుంటే.. 249 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్ కాల్స్ చేసుకునేందుకు ) -2జీబీ డాటా ఉచితం రూ.50తో చేసుకుంటే.. 656 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్ కాల్స్ చేసుకునేందుకు ) -5జీబీ డాటా ఉచితం రూ.100తో చేసుకుంటే.. 1362 నిమిషాలు ( ఇతర నెట్‌వర్క్స్ కాల్స్ చేసుకునేందుకు ) -10జీబీ డాటా ఉచితం