EPF Advance: పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ సౌకర్యం నిలిపేస్తూ కీలక ప్రకటన

ఇటీవల ఈపీఎఫ్ఓ రిలీజ్ చేసిన సర్క్యులర్ ప్రకారం కోవిడ్-19 అడ్వాన్స్ నిలిపివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం మినహాయింపు పొందిన ట్రస్ట్‌లకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

EPF Advance: పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ సౌకర్యం నిలిపేస్తూ కీలక ప్రకటన
Epfo
Follow us

|

Updated on: Jun 17, 2024 | 7:00 AM

దేశంలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక విషయం తెలిపింది. కోవిడ్-19 అడ్వాన్స్ సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి ముప్పు తగ్గడంతో ఈపీఎఫ్ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈపీఎఫ్ఓ రిలీజ్ చేసిన సర్క్యులర్ ప్రకారం కోవిడ్-19 అడ్వాన్స్ నిలిపివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం మినహాయింపు పొందిన ట్రస్ట్‌లకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కోవిడ్-19 సమయంలో ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంలో సహాయపడటానికి ఈపీఎఫ్ఓ కోవిడ్-19 అడ్వాన్లను ప్రకటించింది. రెండో వేవ్ అడ్వాన్స్ మే 31, 2021 నుండి అందుబాటులో ఉంది. అలాగే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించుకునే నిబంధనను మొదట మార్చి 2020లో ప్రవేశపెట్టారు. జూన్ 2021లో ఈపీఎఫ్ సభ్యులు కోవిడ్-19 సంబంధిత ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి రెండవ నాన్- రిఫండబుల్ అడ్వాన్స్ను పొందవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొదట్లో కేవలం వన్-టైమ్ అడ్వాన్స్ మాత్రమే అందుబాటులో ఉండేది.ఈపీఎఫ్ఓ సభ్యులు మూడు నెలల ప్రాథమిక వేతనాలు మరియు డియర్నెస్ అలవెన్స్ లేదా ఈపీఎఫ్ ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తంలో 75 శాతం ఏది తక్కువైతే అది తిరిగి చెల్లించలేని మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి సభ్యులను అనుమతిస్తుంది. సభ్యులు అవసరమైతే తక్కువ మొత్తాలను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.

ఆటోమోడ్ క్లెయిస్ సెటెల్‌మెంట్స్

అలాగే గృహనిర్మాణం, వివాహం, విద్యకు సంబంధించిన క్లెయిమ్ల కోసం ఈపీఎఫ్ఆటో-మోడ్ సెటిల్మెంట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు సభ్యులు వారి యజమాని నుండి ఎలాంటి ధ్రువపత్రాలు అందించాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి