AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-మెయిల్ విషయంలో సెబీ కీలక చర్యలు

ఇటీవల మ్యూచువల్ పండ్ ఖాతాదారులకు సెబీ ఓ కీలక సూచన చేసింది. డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్-రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ల ద్వారా పెట్టుబడిదారు ట్రేడ్ చేసే సెక్యూరిటీల ఖాతాను అందించే  కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన డిఫాల్ట్ మోడ్‌గా ఈ-మెయిల్‌ను మార్కెట్‌ల నియంత్రణ సంస్థ సెబీ తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సర్క్యులర్‌లో తెలిపింది.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-మెయిల్ విషయంలో సెబీ కీలక చర్యలు
Mutual Fund
Nikhil
|

Updated on: Jul 05, 2024 | 4:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. గతంలో స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడిపెడితే ప్రస్తుతం అధిక రాబడి కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడి ధోరణి చూస్తుంటే భారతీయుల్లో ఆర్థిక అక్షరాస్యత పెరిగిందని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మ్యూచువల్ పండ్ ఖాతాదారులకు సెబీ ఓ కీలక సూచన చేసింది. డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్-రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ల ద్వారా పెట్టుబడిదారు ట్రేడ్ చేసే సెక్యూరిటీల ఖాతాను అందించే  కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన డిఫాల్ట్ మోడ్‌గా ఈ-మెయిల్‌ను మార్కెట్‌ల నియంత్రణ సంస్థ సెబీ తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సర్క్యులర్‌లో తెలిపింది. కాబట్టి సెబీ నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది అన్ని మ్యూచువల్ ఫండ్‌లు, డీమెటీరియలైజ్డ్ (డీమ్యాట్) మోడ్‌లో ఉన్న ఇతర సెక్యూరిటీలలో ఒక నెలలో పెట్టుబడిదారుడు చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలను చూపే ఒక సింగిల్ లేదా కంబైన్డ్ అకౌంట్ స్టేట్‌మెంట్. ఆర్‌టీఏలు, డిపాజిటరీలలో పాన్‌లు సాధారణంగా ఉంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డిపాజిటరీ ఖాతాలు రెండింటిలోనూ ఆర్థిక లావాదేవీల వివరాలను అందించడం ద్వారా డిపాజిటరీలు పెట్టుబడిదారులకు సీఏఎస్ పంపుతారు. మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి ఆర్‌టీఏలు, డిపాజిటరీల మధ్య ఉమ్మడి పాన్ లేనప్పుడు మ్యూచువల్ ఫండ్ లావాదేవీలను మాత్రమే కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే సీఏఎస్ పంపుతారు. డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ మోడ్ ఇప్పుడు ప్రాధాన్యత కలిగిన కమ్యూనికేషన్ మోడ్‌గా మారినందును ఖాతా స్టేట్‌మెంట్‌లను పంపే విధానంపై రెగ్యులేటరీ మార్గదర్శకాలను క్రమబద్ధీకరించడానికి రెగ్యులేటరీ నిబంధనలను సవరించామని సెబీ తెలిపింది.

సెబీ తన సర్క్యులర్‌లో డిపాజిటరీలు, ఏఎంసీలు లేదా ఎంఎఫ్-ఆర్‌టీఏల్లో ఈ-మెయిల్ చిరునామాలు నమోదు చేసిన పెట్టుబడిదారులందరికీ సీఏఎస ఈ-మెయిల్ ద్వారా పంపుతారు. అయితే ఒక పెట్టుబడిదారుడు ఈ-మెయిల్ ద్వారా సీఏఎస్‌ను స్వీకరించకూడదనుకుంటే పెట్టుబడిదారుడు భౌతిక రూపంలో స్వీకరించడానికి ఒక ఎంపిక ఇస్తారు. పెట్టుబడిదారుడి డీమ్యాట్ ఖాతాల్లో లేదా అతని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలలో ఏదైనా లావాదేవీ జరిగితే సీఏఎస్ ఆ పెట్టుబడిదారుడికి నెలవారీ ప్రాతిపదికన ఈ-మెయిల్ ద్వారా పంపుతారు. మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలలో ఏదైనా లావాదేవీ జరగకపోతే సీఏఎస్ హోల్డింగ్ వివరాలతో కూడిన అర్ధ వార్షిక ప్రాతిపదికన ఈ-మెయిల్ ద్వారా పెట్టుబడిదారులకు పంపుతారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!