ITR Refund Fraud: పన్ను చెల్లింపుదారులూ తస్మాత్ జాగ్రత్త! ఐటీఆర్ రిఫండ్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు.. నమ్మి క్లిక్ చేశారో ఖతం!
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం(పీఐబీ ఫ్యాక్ట్ చెక్) ఓ హెచ్చరికను పన్ను చెల్లింపు దారులకు అందించింది. స్కామర్లు మీకు ఆదాయ పన్ను రిఫండ్ రూ. 15,490 వచ్చిందంటూ ఫేక్ మెసేజ్ లు చేస్తూ మోసం చేస్తున్నట్లు వివరించింది. ఇటువంటి మెసేజ్ ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిందని భ్రమ పడేలా చేస్తున్నారని పేర్కొంది. అయితే అసలు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అలాంటి మెసేజ్ పంపదని, పన్ను చెల్లింపు దారులు జాగ్రత్త పడాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వింగ్ హెచ్చించింది.

పన్ను చెల్లింపు దారులకు హెచ్చరిక. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) రిఫండ్ వచ్చిందంటూ మీకు మెసేజ్ లు వస్తున్నాయి. వాటికి స్పందించి మెసేజ్ లో ఉన్న లింక్ క్లిక్ చేశారో అంతే ఇక మీ ఖాతా ఖల్లాస్. అంతా దోచేస్తారు. స్కామర్లు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతున్నారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. అలాగే లెటెస్ట్ ట్రెండ్స్, సీజన్ నుబట్టి మోసాలకు పాల్పడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. సరిగ్గా దీనిని ఆసరా చేసుకున్న నేరగాళ్లు ఐటీఆర్ రిఫండ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం(పీఐబీ ఫ్యాక్ట్ చెక్) ఓ హెచ్చరికను పన్ను చెల్లింపు దారులకు అందించింది. మీకు ఆదాయ పన్ను రిఫండ్ రూ. 15,490 వచ్చిందంటూ ఫేక్ మెసేజ్ లు చేస్తూ మోసం చేస్తున్నట్లు వివరించింది. ఇటువంటి మెసేజ్ ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిందని భ్రమ పడేలా చేస్తున్నారని పేర్కొంది. అయితే అసలు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అలాంటి మెసేజ్ పంపదని, పన్ను చెల్లింపు దారులు జాగ్రత్త పడాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వింగ్ హెచ్చరించింది.
వైరల్ గా మారిన మెసేజ్..
ఐటీఆర్ రిఫండ్ అంటూ వచ్చిన మెసేజ్ నెట్టింట వైరల్ అయ్యింది. మోసపూరిత లింక్‌ల ద్వారా తమ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు స్కామర్‌లు పన్ను చెల్లింపుదారులను ఒప్పిస్తున్నందున, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది.
A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck
✔️ This claim is 𝐅𝐚𝐤𝐞.
✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message.
✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg
— PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023
ఫిషింగ్ స్కామ్‌లు.. నివారణ చర్యలు
ఇటువంటి హానికరమైన సందేశాల బారిన పడకుండా ఉండటానికి, పన్ను చెల్లింపుదారులు కొన్ని ముఖ్యమైన అంశాలను గమనించాలి. ప్రధానంగా, ఆదాయపు పన్ను శాఖ ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా రిఫండ్ లింక్‌లను పంపదు. ఐటీ విభాగం మిమ్మల్ని పిన్ లు లేదా పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడగదు. ఫిషింగ్ స్కామ్‌లో భాగంగా ఎస్ఎంఎస్ లింక్‌ల ద్వారా స్వీకరించబడిన వెబ్‌సైట్‌లలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని వినియోగదారులకు ఐటీ డిపార్ట్ మెంట్ హెచ్చరిస్తోంది.
అంతేకాకుండా, ఆదాయపు పన్ను శాఖ నుండి అనుమానాస్పద ఈ మెయిల్‌లు లేదా వెబ్‌సైట్ లింక్‌లను స్వీకరించినప్పుడు పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యుత్తరం ఇవ్వడం, జోడింపులను తెరవడం లేదా లింక్‌లపై క్లిక్ చేయడం వంటి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ లింక్ లను క్లిక్ చేయడం ద్వారా స్కామర్లు వినియోగదారుల సిస్టమ్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
ఫిర్యాదు చేయండి..
మోసపూరిత ట్యాక్స్ రిటర్న్ కార్యకలాపాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాలను నివేదించడం కోసం, ఈ అనుమానిత ఈమెయిల్‌లు లేదా వెబ్‌సైట్ యూఆర్ఎల్ లను అధికారిక విచారణ కోసం webmanager@incometax.gov.in, incident@cert-in.org.in కి పంపవచ్చు . అంతేకాకుండా, మెరుగైన భద్రత కోసం ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ను వినియోగించాలని ఆదాయపు పన్ను శాఖ సిఫార్సు చేస్తోంది.
ఐటీఆర్ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు..
పన్ను చెల్లింపుదారులు వారి పాన్ నంబర్/ఆధార్ నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి నేరుగా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్ సైట్లో ఐటీఆర్ వాస్తవ పరిస్థితిని యాక్సెస్ చేయవచ్చు. దీన్ని అనుసరించి, ‘ఇ-ఫైల్’ ఎంపిక కింద ‘ఆదాయ పన్ను రిటర్న్‌లు’ ఎంచుకుంటే ఇటీవల దాఖలు చేసిన ఐటీఆర్ మీకు కనిపిస్తుంది. చట్టబద్ధమైన ఐటీఆర్ రిటర్న్ అనేది ఆదాయపు పన్ను శాఖ ద్వారా తగిన ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. సాధారణంగా రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి 7 నుంచి 120 రోజులలోపు రిటర్న్ రిఫండ్ మీకు జమఅవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







