LPG Gas E-KYC: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ రోజే ఇది పూర్తి చేయండి.. లేకుంటే నష్టపోతారు..
ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31లోపు ఈ-కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. గ్యాస్ సిలెండర్ రీఫిల్ పై సబ్సిడీ పొందాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొంది. భారత ప్రభుత్వం చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం, సబ్సిడీ గ్యాస్ ధరలను పొందుతున్న వినియోగదారులకు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు.
ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ప్రస్తుతం సమాజంలో లేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు సబ్సిడీలపై గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాయి. అంతేకాక గ్యాస్ సిలెండర్ల కొనుగోలుపై కూడా సబ్సిడీని అందిస్తున్నాయి. నెలకో, రెండు నెలలో సిలెండర్ రీఫిల్ చేసుకున్నప్పుడు సబ్సిడీ మొత్తం కనెక్షన్ లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. అయితే గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏ అలర్ట్ ను జారీ చేసింది. అదేంటంటే అందరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించింది. గ్యాస్ సబ్సిడీ పొందాలంటే దీనిని తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రద్దయిపోతుందని హెచ్చరించింది. ఈ డిసెంబర్ 31లోపు గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించాలని సూచించింది.
ఎలా చేయించాలి..
ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31లోపు ఈ-కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. గ్యాస్ సిలెండర్ రీఫిల్ పై సబ్సిడీ పొందాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొంది. భారత ప్రభుత్వం చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం, సబ్సిడీ గ్యాస్ ధరలను పొందుతున్న వినియోగదారులకు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. ఈ-కేవైసీ చేసుకోవడానికి వినియోగదారులు వారు వినియోగిస్తున్న గ్యాస్ సిలెండర్ ఏజెన్సీ వారి కార్యాలయానికి వెంటనే వెళ్లాలని సూచించింది. అలా కాని పక్షంలో వినియోగదారులకు లభించే సబ్సిడీ రీయింబర్స్ మెంట్ పూర్తిగా నిలిచిపోతుందని ప్రకటించింది.
గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా వెల్లి ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. నవంబర్ 25 నుంచి ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్ 31 ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఆధార్ కార్డు ఉంటే చాలు..
ఈ-కేవేసీ చేయడానికి గ్యాస్ సిలెండర్లు హోం డెలివరీ చేసే ఏజెన్సీ వాహనాల వద్ద కూడా వీలు కల్పించారు. మీకు సిలెండర్ డెలివరీ ఇవ్వడానికి ఇంటికి వచ్చే వ్యక్తిని ఈ-కేవైసీ గురించి అడిగితే అతను దానిని చేసేస్తారు. అయితే ఈ-కేవైసీ పూర్తి చేయాలంటే వినియోగదారుడు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయోమెట్రిక్ మెషీన్‌లో ఆధార్ కార్డు నంబర్లను సరిపోల్చిన తర్వాత, ఫింగర్ ప్రింట్ తీసుకోవడంతో ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు యథావిధిగా సబ్సిడీ మొత్తం మీ ఖాతాలో జమవుతుంది. ఆధార్ కార్డు మీ గ్యాస్ ఏజెన్సీలో నమోదై ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..