Aditya Birla: ఆదిత్య బిర్లా నుంచి సూపర్ టర్మ్ ప్లాన్.. అద్భుతమైన బెనిఫిట్స్..!
Aditya Birla Sun Life Insurance: హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను కూడా అందించేలా ఈ 'ఆల్-ఇన్-వన్ ప్యూర్ ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్' రూపొందించింది. కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, పాలసీదారుల సంక్షేమానికి తోడ్పడటంలో కంపెనీకి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్లాన్..

భారతదేశపు విభిన్న ఆర్థిక సేవల దిగ్గజం ఆదిత్య బిర్లా క్యాపిటల్లో భాగమైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABSLI) సరికొత్త ఏబీఎస్‌ఎల్‌ఐ సూపర్ టర్మ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. నిర్దిష్ట లక్ష్య ఆధారిత ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా, అంతర్గతంగా హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను కూడా అందించేలా ఈ ‘ఆల్-ఇన్-వన్ ప్యూర్ ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్’ రూపొందించింది. కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, పాలసీదారుల సంక్షేమానికి తోడ్పడటంలో కంపెనీకి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: Helicopter Pilot: హెలికాప్టర్ పైలట్ నెల జీతం ఎంత ఉంటుందో తెలుసా..?
సూపర్ టర్మ్ ప్లాన్ అందించే మూడు రకాల కవరేజీ ఆప్షన్లు:
- లెవెల్ కవర్ (Level Cover): ఇది పాలసీ టర్మ్ అంతటా స్థిరంగా నిర్దిష్ట సమ్ అష్యూర్డ్‌ను అందిస్తుంది. పాలసీదారు మరణానంతరం ఈ మొత్తం ఒకేసారి, లేదా నెలవారీ ఆదాయం రూపంలో, లేదా ఈ రెండింటిని చెల్లిస్తుంది.
- పెరిగే కవరేజీ (Increasing Cover): దీని ప్రకారం కాలక్రమేణా కవరేజీ పెరుగుతుంది. ఏటా సమ్ అష్యూర్డ్ 5 శాతం చొప్పున (సాధారణ వడ్డీ) పెరుగుతుంది.
- రిటర్న్ ఆఫ్ ప్రీమియంతో లెవెల్ కవర్: పాలసీ మెచ్యూర్ అయ్యేంత వరకు పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో డెత్ బెనిఫిట్‌తో పాటు కట్టిన మొత్తం ప్రీమియంలు 100 శాతం వాపసు ఉంటుంది.
ప్రయోజనాలు:
- సమగ్ర ఆరోగ్య నిర్వహణ: పటిష్టమైన లైఫ్ ప్రొటెక్షన్‌తో పాటు పాలసీ టర్మ్ అంతటా హెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసులు అందించేలా ఈ ప్లాన్ రూపొందించింది. తద్వారా పాలసీదారులు తమ కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పిస్తూనే, తమ ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించుకుంటూ, సంరక్షించుకునేందుకు వీలవుతుంది.
- ఎన్‌హాన్స్‌డ్ లైఫ్ స్టేజ్ ప్రొటెక్షన్: జీవితకాలంలో వివాహం, పిల్లలు పుట్టడం లేదా గృహ రుణం వంటి సందర్భాలను బట్టి సమ్ అష్యూర్డ్‌ను పెంచుకునేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్‌ను ప్రారంభంలోనే ఎంచుకోవాలి. నిర్దేశిత అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
- తక్షణ క్లెయిమ్ చెల్లింపు: ABSLI సూపర్ టర్మ్ ప్లాన్ ‘ఇన్‌స్టంట్ పేమెంట్ ఆన్ క్లెయిమ్ ఇంటిమేషన్’ సదుపాయాన్ని అందిస్తుంది. దీని ద్వారా క్లెయిమ్ నమోదైన ఒక పని దినంలోగా నిర్దిష్ట మొత్తం చెల్లించబడుతుంది.
- డెత్ బెనిఫిట్స్: పాలసీదారులు ప్రారంభంలోనే మూడు పే-అవుట్ ఆప్షన్లు అంటే ఏకమొత్తం, నెలవారీగా సమాన స్థాయిలో ఆదాయం, లేదా ఈ రెండింటి (ఇన్‌కం ప్లస్ లంప్సమ్)ను ఎంచుకోవచ్చు.
- వాయిదాలలో ప్రయోజనాలు: అదనంగా స్టాజర్డ్ డెత్ బెనిఫిట్ ఆప్షన్‌తో నామినీ ఐదేళ్ల వ్యవధిలో బెనిఫిట్స్‌ను నెలవారీ వాయిదాల రూపంలో కూడా పొందవచ్చు.
- ఇన్‌కం బెనిఫిట్ కమ్యుటేషన్: ఈ ప్లాన్‌లో కమ్యుటేషన్ ఆఫ్ ఇన్‌కం బెనిఫిట్ కూడా ఉంది. ఇన్‌కం బెనిఫిట్ అందుకునే వ్యవధిలో ఎప్పుడైనా సరే నెలవారీ ఆదాయ చెల్లింపులను ఏకమొత్తం కింద మార్చుకునేందుకు నామినీకి వెసులుబాటు ఉంటుంది.
ఈ ప్లాన్ గురించి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈవో మిస్టర్. కమలేష్ రావు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక భద్రత, నిశ్చింతను కలిగించే బీమా పథకాలతో వ్యక్తులు, కుటుంబాలకు సాధికారత కల్పించేందుకు ABSLI కట్టుబడి ఉందన్నారు. సరళతరమైన కవరేజీ, పూర్తి స్థాయిలో హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు, క్రిటికల్ ఇల్‌నెస్, వైకల్యం సహా జీవితపు అనిశ్చితుల నుంచి కూడా భద్రతను అందించేలా ABSLI సూపర్ టర్మ్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: School Holidays: జూలైలో పాఠశాలలకు వరుసగా సెలవులు ఉంటాయా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి