- Telugu News Photo Gallery Business photos BSNL’s best plan.. 80 days validity, along with 2GB data per day, the price is just this much
BSNL నుంచి చౌకైన ప్లాన్.. 80 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా
BSNL Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ దూసుకుపోతోంది. ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థల కంటే చౌకైన రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల కంటే చౌకైన ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్‌ను తీసుకువస్తోంది..
Updated on: Jun 17, 2025 | 9:20 PM

ఇప్పుడు BSNL తన కస్టమర్ల కోసం రెండు గొప్ప వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇవి డేటా, అపరిమిత కాలింగ్, రోజువారీ SMS సదుపాయాలతో చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌ల ధర రూ.1,515, రూ. 1,499. ఇందులో మీ సగటు నెలవారీ ఛార్జీ కేవలం రూ. 127.

BSNL రూ.1,515 ప్లాన్: ఈ ప్లాన్‌లో మీరు ఒక సంవత్సరం చెల్లుబాటును పొందుతారు. అంటే పూర్తి 365 రోజులు. అలాగే ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాకుండా, ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్ లేనప్పటికీ, వినియోగదారులు ఏడాది పొడవునా మొత్తం 720GB డేటాను పొందుతారు.

ఈ రూ.1,515 ప్లాన్‌ను 12 నెలలుగా విభజిస్తే నెలవారీ ఖర్చు కేవలం రూ.126.25 అవుతుంది. అంటే దాదాపు రూ.127 చెల్లించడం ద్వారా మీరు ఒక సంవత్సరం పాటు రీఛార్జ్ ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చు. మీరు ప్రతి నెలా రీఛార్జ్ చేయడం కష్టంగా భావిస్తే, నిరంతర కాలింగ్, ఇంటర్నెట్ ప్రయోజనాలను కోరుకుంటే ఇది మీకు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్ కావచ్చు.

BSNL తన వినియోగదారులకు ఇవన్నీ కేవలం రూ.485కే అందిస్తోంది. మీరు అపరిమిత కాలింగ్, దీర్ఘకాలిక చెల్లుబాటుతో డేటాను పొందుతారు. దీనితో పాటు, వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ BiTV సేవను కూడా పొందుతారు.

ఈ ప్లాన్ లో మీకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. BSNL ఈ ప్లాన్ లో కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి మీరు ఉచిత కాలర్ ట్యూన్లను ఉపయోగించవచ్చు. Zing యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ చాలా తక్కువ ధర, దీర్ఘకాల చెల్లుబాటుతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు ఒక సంవత్సరం పాటు రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది ఉండదు.




