AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..? ఏయే డాక్యుమెంట్స్ అవసరమంటే..?

ఆధార్ కార్డు అనేది అందరికీ అవసరమైన డాక్యుమెంట్. ఇది లేనిది ఏ పని జరగదు. అందుకే ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి వస్తుంది. ఆధార్ కార్డుతో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. ఇటీవల కాలంలో ఆధార్ వినియోగం మరింత పెరిగిపోతోంది.

Aadhaar Card: ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..? ఏయే డాక్యుమెంట్స్ అవసరమంటే..?
Aadhaar
Venkatrao Lella
|

Updated on: May 21, 2026 | 11:18 AM

Share

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్ ఆధార్. ఇది లేనిది ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులు పొందలేరు. ఏ సేవకు, సర్వీసుకు అయినా సరే ప్రధానమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఇది ఉపయోగపడుతుంది. దీంతో ఆధార్ అనేది ప్రతీఒక్కరికీ అవసరం. ఉచితంగా ఆధార్ కోసం నమోదు చేసుకోవచ్చు. దేశంలోని ఏ ఆధార్ సెంటర్‌లో అయినా ఉచితంగా నమోదు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. ఇంతకు ఆధార్ నమోదు ప్రాసెస్ ఏంటి..? ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం? అనే విషయాలు చూద్దాం.

ఆధార్ నమోదు ఎలా..?

-సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లండి

-ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారం నింపండి

-గుర్తింపు రుజువు కోసం పాన్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉపయోగపడతాయి

-ఇక ఫొటోతో కూడిన ప్రభుత్వం గుర్తింపు కార్డులు కూడా ఉపయోగపడతాయి

-అడ్రస్ ప్రూఫ్ కోసం గత మూడు నెలల కరెంట్ బిల్లు లేదా ల్యాండ్‌లైన్ టెలిఫోన్ బిల్లులు తీసుకెళ్లాలి

-ఇక గుర్తింపు పత్రాలు లేనప్పుడు కుటుంబ పెద్ద ఆధారంగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చు. కుటుంబ పెద్ద నమోదు చేసుకునే సమయంలో కుటుంబసభ్యులను పరిచయం చేయవచ్చు

-ఆధార్ కోసం ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువసార్లు నమోదు చేసుకుంటే దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి

-18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నాక ఆధార్ పొందేందుకు 180 రోజుల సమయం ఉంటుంది

-ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్

-డేట్ ఆఫ్ బర్ట్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షనర్ ఫొటో ఐడెంటిటీ కార్డ్, ఈఎస్‌ఐ, సీజీహెచ్, ఈసీహెచ్‌ఎస్ లాంటి మెడీ క్లెయిమ్ కార్డులు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డు, మార్క్ షీట్లు

ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే..?

డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలంటే పదో తరగతి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం. ఇక అడ్రస్ మార్చుకోవాలంటే కరెంట్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ వంటి ఉపయోగపడతాయి. యూఐడీఏఐ వెబ్ సైట్ లేదా ఆధార్ యాప్‌లోకి వెళ్లి సులువుగా మార్చుకోవచ్చు. ఇక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం ముందగా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్నాన ఆ టైమ్‌కు ఆధార్ సెంటర్‌కు వెళ్లి పని పూర్తి చేసుకోవచ్చు. దీని వల్ల ముందే వెయిటింగ్ చేయాల్సి పని తప్పుతుంది. దీని వల్ల సమయం ఆదా అవుతంది.

Follow Us