AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Governance: ఇకపై ఆధార్ ప్రామాణీకరణ మరింత సులభం.. కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన కేంద్రం

భారతదేశంలోని పౌరులకు ఆధార్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న అవసరానికి గుర్తింపుగా ఆధార్ కార్డు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో సుపరిపాలనకు ఆధార్ సేవలను ఉపయోగించుకునేలా కేంద్రం కీలక చర్యలను తీసుకుంది. ముఖ్యంగా ఆధార్ ప్రామాణీకరణ అభ్యర్థనల కోసం కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది.

Aadhaar Governance: ఇకపై ఆధార్ ప్రామాణీకరణ మరింత సులభం.. కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన కేంద్రం
Aadhaar Governance
Nikhil
|

Updated on: Mar 01, 2025 | 3:30 PM

Share

ఆధార్ ప్రామాణీకరణ అభ్యర్థనల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల ద్వారా ఆధార్ ప్రామాణీకరణ అభ్యర్థన కోసం ఆమోద ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్ పని చేస్తుంది. ఆధార్ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, ప్రయోజనాలు, సేవల లక్ష్య డెలివరీ) చట్టం, 2016 ప్రకరారం ఈ పోర్టల్ వినియోగదారులకు చాలా  ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోగ్య సంరక్షణ విషయంలో వేగవంతమైన రోగి ధ్రువీకరణ, అలాగే విద్యారంగంలో పరీక్షలు, ప్రవేశాల కోసం సజావుగా విద్యార్థి ప్రామాణీకరణ పొందవచ్చు. అలాగే ఈ-కామర్స్ & అగ్రిగేటర్లు సురక్షిత లావాదేవీల కోసం సరళీకృత ఈ-కేవైసీ క్రెడిట్ రేటింగ్ & ఆర్థిక సేవలు, రుణాలు, ఆర్థిక ఉత్పత్తుల కోసం సమర్థవంతమైన గుర్తింపు ధ్రువీకరణ పొందవచ్చు. అలాగే కార్యాలయ నిర్వహణ అంటే సిబ్బంది హాజరు, హెచ్‌ఆర్ ధ్రువీకరణ ఆధార్ గుడ్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది. ఆధార్ ప్రామాణీకరణ సేవల కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ దశల వారీ మార్గదర్శిగా పనిచేస్తుంది

పోర్టల్‌లో నమోదు ఇలా

  • ముందుగా అధికారిక పోర్టల్‌ను సందర్శించి, అందులో ఒక సంస్థగా నమోదు చేసుకోవాలి.
  • ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • అనంతరం దరఖాస్తును సమర్పించి, ఆధార్ ప్రామాణీకరణ ఎందుకు అవసరమో వివరాలను అందించాలి. 
  • సిస్టమ్ నియంత్రణ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను ప్రాసెస్ చేస్తుంది. 
  • అనంతరం ప్రామాణీకరణ సేవలను ఏకీకృతం చేసి సంస్థలు వారి యాప్‌లు, సిస్టమ్‌లలో ఆధార్ ప్రామాణీకరణను ఏకీకృతం చేయవచ్చు. 

ఈ పోర్టల్ లాంచ్‌పై ఎంఈఐటీవై కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ ఈ ప్లాట్‌ఫామ్‌తో వేగవంతమైన సుపరిపాలన అందుతుందన్నారు. అలాగే యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ మాట్లాడుతూ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ప్రామాణీకరణ అభ్యర్థనల సమర్పణ, ఆమోదాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇది ప్రైవేట్ సంస్థలు ఆధార్ ప్రామాణీకరణను కస్టమర్-ఫేసింగ్ యాప్‌లలో ఏకీకృతం చేయడానికి అనుమతిస్తుందని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..