అమెజాన్‌-రిలయన్స్‌ డీల్ కుదిరేనా?

అమెరికాకు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, రిలయన్స్‌తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖేశ్‌ అంబానీ-జెఫ్ బేజోస్‌ మధ్య చర్చలు జరుగుతాయని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఉన్నతోద్యోగులు వెల్లడించినట్లు శుక్రవారం అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ తెలిపింది. ఇద్దరు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కలవడం ద్వారా ఇప్పటికే భారత్‌లో వ్యాపిస్తున్న వాల్‌మార్ట్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. గతేడాది వాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌తో భాగస్వామ్యం కోసం అమెజాన్‌ […]

అమెజాన్‌-రిలయన్స్‌ డీల్ కుదిరేనా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 02, 2019 | 9:03 PM

అమెరికాకు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, రిలయన్స్‌తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖేశ్‌ అంబానీ-జెఫ్ బేజోస్‌ మధ్య చర్చలు జరుగుతాయని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఉన్నతోద్యోగులు వెల్లడించినట్లు శుక్రవారం అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ తెలిపింది. ఇద్దరు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కలవడం ద్వారా ఇప్పటికే భారత్‌లో వ్యాపిస్తున్న వాల్‌మార్ట్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. గతేడాది వాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌తో భాగస్వామ్యం కోసం అమెజాన్‌ ప్రతిపాదన తెచ్చిందని, అయితే ఇది ఇంకా చర్చల వరకూ వెళ్లలేదని ఉద్యోగి తెలిపారు. ఫిబ్రవరిలోపు రిలయన్స్‌ రీటైల్‌లో 26 శాతం వరకూ వాటా కొనుగోలు కోసం అమెజాన్‌ ప్రతిపాదించినట్లు మరో ఉన్నతోద్యోగి వెల్లడించారు. రిలయన్స్‌కు దేశ వ్యాప్తంగా దాదాపు 10,600కు పైగా రీటైల్‌ దుకాణాలు ఉండడం అమెజాన్‌కు బాగా కలిసొస్తుంది. అంతేకాక అంబానీ కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడులు బాగా ఉపయోగపడే అవకాశముందని వ్యాపార పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.