AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Car Offers: ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.2.05 లక్షల తగ్గింపు

భారతదేశంలోని కార్ల మార్కెట్‌లో ప్రస్తుతం ప్యాసింజర్ వాహన విక్రయాలు నెమ్మదిగా జరుగుతున్నాయి. అయితే పండుగల సీజన్ సమీపిస్తుండటంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఫెస్టివల్ ఆఫ్ కార్స్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు రాబోయే రెండు నెలల్లో అమ్మకాలను పెంచే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పండుగల సీజన్‌లో టాటా తన ఐసీఈ మోడల్స్‌పై రూ.2.05 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది.

Tata Car Offers: ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.2.05 లక్షల తగ్గింపు
Tata Cars
Nikhil
|

Updated on: Sep 11, 2024 | 4:45 PM

Share

భారతదేశంలోని కార్ల మార్కెట్‌లో ప్రస్తుతం ప్యాసింజర్ వాహన విక్రయాలు నెమ్మదిగా జరుగుతున్నాయి. అయితే పండుగల సీజన్ సమీపిస్తుండటంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఫెస్టివల్ ఆఫ్ కార్స్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు రాబోయే రెండు నెలల్లో అమ్మకాలను పెంచే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పండుగల సీజన్‌లో టాటా తన ఐసీఈ మోడల్స్‌పై రూ.2.05 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపులు అక్టోబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా ప్రముఖ కార్లు అయిన టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్ హెయిర్, సఫారీ వంటి మోడల్స్‌పై ఈ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే టాటా పంచ్, అలాగే టాటా కర్వ్ కార్లకు ఎలాంటి తగ్గింపులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో పండుగల సీజన్‌లో ఏయే టాటా కార్లపై ఎంత మేరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం.  

టాటా మోటార్స్ టియాగో రూ. 4.99 లక్షలు, ఆల్టోజ్ రూ. 6.49 లక్షలు, నెక్సాన్ రూ.7.99 లక్షలు, హారియర్ రూ. 14.99 లక్షలు, సఫారీ రూ. 15.49 లక్షలతో సహా ప్రముఖ మోడళ్లకు కొత్త ఎంట్రీ ధరలను ప్రకటించింది. టాటాకుు సంబందించిన ఫ్లాగ్లిప్ ఎస్‌యూవీల కోసం అతిపెద్ద డిస్కౌంట్లు రిజర్వ్ చేశారు. ముఖ్యంగా టాటా సఫారి కారుపై అత్యధికంగా రూ. 1.80 లక్షల తగ్గింపును అందిస్తున్నాయి. అయితే హారియర్ ఎస్‌యూవీ రూ. 1.60 లక్షల వరకు తగ్గింపుతో వస్తుంది. టాటా లైనప్‌లోని ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన నెక్సాన్ ధర రూ. 80,000 వరకు తగ్గింపుతో అందిస్తున్నార. 

అమ్మకాల విషయంలో రికార్డులు సృష్టించిన టాటా టియాగో కారు రూ. 65,000 వరకు తగ్గింపుతో వస్తుంది. అయితే ఆల్టోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రూ.45,000 వరకు పొదుపుతో పొందవచ్చు. అలాగే టిగోర్ కాంపాక్ట్ సెడాన్, పెట్రోల్, సీఎన్‌జీ ఎంపికలతో ఈ కారు రూ.30,000 వరకు తగ్గింపుతో వస్తుంది. అలాగే ఈ ధరల తగ్గింపులకు అదనంగా టాటా మోటార్స్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.45,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us