Gold Price: మళ్లీ లక్ష దాటేసిన పసిడి.. ఒక్క రోజే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర
Gold Price Today: ఇటీవల కూడా లక్ష రూపాయలు దాటేసిన పసిడి ధరలు.. తర్వాత క్రమంగా దిగి వచ్చాయి. కానీ మళ్లీ ఇప్పుడు అదే జోరు కొనసాగిస్తోంది. లక్ష రూపాయలు దాటడంతో వినియోగదారులకు కొనేందుకు వెనుకాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం..

శుక్రవారం భారతదేశంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.2,120 పెరిగింది. దీనితో బంగారం ధర లక్ష దాటింది. అదే సమయంలో వెండి కూడా తగ్గేదేలే అన్నట్లు ఎగబాకుతోంది. కిలో వెండి ధరపై రూ.1,100 పెరిగింది. ఇటీవల కూడా లక్ష రూపాయలు దాటేసిన పసిడి ధరలు.. తర్వాత క్రమంగా దిగి వచ్చాయి. కానీ మళ్లీ ఇప్పుడు అదే జోరు కొనసాగిస్తోంది. లక్ష రూపాయలు దాటడంతో వినియోగదారులకు కొనేందుకు వెనుకాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $3,426.62గా ఉంది. అలాగే 1 గ్రాము బంగారం ధర $110.17గా ఉంది. అదే సమయంలో వెండి ఔన్సుకు $36.06 స్థాయిలో నడుస్తోంది.
ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,400 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,950 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండి ధర 1 లక్ష 10 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో మాత్రం మరింతగా ఉంది. కిలో వెండి ధర 1 లక్షా 20 వేల వరకు ఎగబాకింది.
బంగారం, వెండి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణాలు:
- అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుదల: నేడు బంగారం ఔన్సుకు రికార్డు స్థాయిలో $3,426.62కి చేరుకుంది. ఇది ప్రపంచ మార్కెట్‌లో అస్థిరత, ఆర్థిక ఆందోళనలను సూచిస్తుంది. వెండి కూడా ఔన్సుకు $36.06కి చేరుకుంది. ఇది పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లు సూచిస్తుంది.
- డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గింది: నేడు 1 US డాలర్ ధర రూ.85.72, ఇది రూపాయి బలహీనతను చూపుతుంది. బలహీనమైన రూపాయి కారణంగా భారతదేశంలోకి దిగుమతి చేసుకునే బంగారం, వెండి ఖరీదైనవిగా మారాయి.
- ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: మధ్యప్రాచ్యం (ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం) అలాగే ఉక్రెయిన్-రష్యా వివాదం వంటి కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎగబాకుతోంది.
- కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు : ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలను బలపరుస్తోంది.
- భారతదేశంలో పెట్టుబడులు, వివాహాల సీజన్: జూన్ నెలలో అనేక రాష్ట్రాల్లో వివాహ వేడుకలు జరుగుతాయి. దీని వల్ల స్థానికంగా బంగారం డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణం నుండి తమను తాము రక్షించుకోవడానికి పెట్టుబడిదారులు కూడా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
- స్టాక్ మార్కెట్లు, క్రిప్టోకరెన్సీలలో క్షీణత : ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు, క్రిప్టోకరెన్సీలు అస్థిరతను చూస్తున్నాయి. దీనివల్ల పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇది కూడా చదవండి: Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానానికి ఇది ఎందుకంత ముఖ్యం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి