PM Kisan: ఆ రోజునే పీఎం కిసాన్ 17వ విడత నిధుల జమ.. లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకోవాల్సిందే..!

పీఎం-కిసాన్ పథకానికి సంబంధించి 17వ విడత మే చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. 16వ విడతను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఫిబ్రవరి 28, 2024న మహారాష్ట్రలోని యవత్మాల్‌లో తన పర్యటన సందర్భంగా 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్ల విలువైన పీఎం-కిసాన్ పథకం యొక్క 16వ విడతను ప్రధాని విడుదల చేశారు. 15వ విడతను నవంబర్ 15, 2023న మోదీ విడుదల చేశారు. 

PM Kisan: ఆ రోజునే పీఎం కిసాన్ 17వ విడత నిధుల జమ.. లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకోవాల్సిందే..!
Pm Kisan
Follow us
Srinu

|

Updated on: Apr 09, 2024 | 5:30 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) 17వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు . నివేదికల ప్రకారం పీఎం-కిసాన్ పథకానికి సంబంధించి 17వ విడత మే చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. 16వ విడతను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఫిబ్రవరి 28, 2024న మహారాష్ట్రలోని యవత్మాల్‌లో తన పర్యటన సందర్భంగా 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్ల విలువైన పీఎం-కిసాన్ పథకం యొక్క 16వ విడతను ప్రధాని విడుదల చేశారు. 15వ విడతను నవంబర్ 15, 2023న మోదీ విడుదల చేశారు.  పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 పొందుతారు. ఇది సంవత్సరానికి రూ. 6,000. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి వంటి మూడు వాయిదాలలో డబ్బు అందిస్తారు. ఈ పెట్టుబడి సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అయితే పీఎం కిసాన్ వాయిదాలను స్వీకరించడానికి రైతులు తమ ఈ-కేవైసీని పూర్తి చేయాలి. పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పీఎం-కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీప సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.

లబ్ధిదారుని స్థితి తనిఖీ ఇలా 

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • పేజీకి కుడి వైపున ఉన్న ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ని పూరించి, ‘డేటా పొందండి’ ఎంపికను ఎంచుకుంటే స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది.

పీఎం-కిసాన్ జాబితాలో మీ పేరు తనిఖీ ఇలా

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • డ్రాప్-డౌన్ నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంచుకోవాలి.
  • ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత లబ్ధిదారుల జాబితా వివరాలు ప్రదర్శితమవుతాయి

పీఎం కిసాన్ దరఖాస్తు ఇలా

  • పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • ‘కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా నింపాలి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి, ‘అవును’పై క్లిక్ చేయాలి.
  • పీఎం-కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అడిగిన సమాచారాన్ని పూరించాలి. దానిని సేవ్ చేసి, భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..