GPay Loan: ఆర్థిక అవసరాలకు ప్రత్యేక ఆసరా.. గూగుల్ పేలో లోన్ సదుపాయం
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రుణం పొందడం సుదీర్ఘ ప్రక్రియగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్ పే లోన్ సదుపాయాన్ని అందిస్తుంది. తన యూజర్లకు రూ.15000 వరకూ లోన్ పొందే అవకాశం ఇస్తుంది. గూగుల్ పే యాప్ ద్వారా అందించే లోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది సర్వ సాధారణంగా మారింది. పెరిగిన టెక్నాలజీ ప్రకారం మొబైల్ ఫోన్స్‌లోని యాప్స్ ద్వారా లోన్‌లు అందించే సదుపాయం వచ్చేసింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రుణం పొందడం సుదీర్ఘ ప్రక్రియగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్ పే లోన్ సదుపాయాన్ని అందిస్తుంది. తన యూజర్లకు రూ.15000 వరకూ లోన్ పొందే అవకాశం ఇస్తుంది. గూగుల్ పే యాప్ ద్వారా అందించే లోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గూగుల్ తన 9వ ఎడిషన్‌లో ఈ లోన్ విషయాన్ని ప్రకటించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారుల కోసం ఈ లోన్ సదుపాయం చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గూగుల్ పే డీఎంఐ ఫైనాన్స్‌తో భాగస్వామ్యంతో లోన్ సదుపాయం అందిస్తుంది. చిన్న వ్యాపారులకు తరచుగా చిన్న రుణాలు, అనువైన రీపేమెంట్ ఆప్షన్‌లు అవసరమని తెలుసుకుని ఈ సదుపాయాన్ని తీసుకొస్తుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి గూగుల్ పే డీఎంఐ ఫైనాన్స్‌తో కలిసి సాచెట్ లోన్‌ను ప్రారంభించింది . గూగుల్ పే అధికారిక సమాచారం ప్రకారం నిర్దిష్ట అర్హత కలిగిన భారత పౌరులు ఎవరైనా రూ. 5 వేల నుంచి 15 వేల వరకు రుణాన్ని పొందవచ్చు .
లోన్ మొత్తాన్ని వ్యాపారం, ఇల్లు, వివాహం, వైద్య రుసుములు, మరెన్నో ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. గూగుల్ పే మీకు ఎలాంటి డాక్యూమెంటేషన్ ప్రక్రియ లేకుండా చాలా తక్కువ వ్యవధిలో రుణాన్ని అందిస్తుంది. అందుకే మీరు ఏదైనా వైద్య/ఆర్థిక/కుటుంబ సమస్య కోసం గూగుల్ పే నుంచి రుణం తీసుకోవచ్చు. గూగుల్ పే సాచెట్ లోన్ రీపేమెంట్ 111 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. మీరు రుణానికి సంబంధించి వాయిదాగా నెలకు 111 రూపాయల మొత్తాన్ని చెల్లించాలి. అధికారిక సమాచారం ప్రకారం టైర్-2 నగరాలకు గూగుల్ పే ఈ రుణాన్ని అందిస్తోంది. 15 వేల కంటే ఎక్కువ జీతం ఉన్న టైర్ 2 నగరాల్లోని పౌరులందరూ ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..