Fixed Deposits: రెపో రేటు మారలేదు.. ఈ సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

ఏప్రిల్ 5న జరిగిన మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ, ద్రవ్య విధాన కమిటీ) లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫేసిలిటీ(ఎల్ఏఎఫ్)ను 6.50శాతం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లపై దీని ప్రభావం పడుతుంది. అలాగే ఇన్వెస్టర్లు ముఖ్యంగా దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి ఆలోచిస్తున్నవారు, ఈ నిర్ణయం వల్ల గణనీయంగా ప్రభావితం కావచ్చని నిపుణులు చెబుతున్నాయి.

Fixed Deposits: రెపో రేటు మారలేదు.. ఈ సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
Fd Scheme
Follow us
Madhu

|

Updated on: Apr 09, 2024 | 2:41 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మరోసారి రెపో రేటును యథాతథంగా ఉంచేసింది. వరుసగా ఏడో సారి ఎటువంటి మార్పు చేయకుండా అలాగే కొనసాగించింది. ఏప్రిల్ 5న జరిగిన మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ, ద్రవ్య విధాన కమిటీ) లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫేసిలిటీ(ఎల్ఏఎఫ్)ను 6.50శాతం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లపై దీని ప్రభావం పడుతుంది. అలాగే ఇన్వెస్టర్లు ముఖ్యంగా దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి ఆలోచిస్తున్నవారు, ఈ నిర్ణయం వల్ల గణనీయంగా ప్రభావితం కావచ్చని నిపుణులు చెబుతున్నాయి. భవిష్యత్‌లో ఆర్బీఐ రెపో రేటును ఫ్లాట్‌గా ఉంచినంత కాలం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల రుణ ఖర్చులు స్థిరంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లను షెడ్యూల్ చేయడం గురించి ఆలోచించడానికి ఇది ఒక అద్భుతమైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారి అంచనాలు, పెట్టుబడిదారులకు సూచనలిస్తున్నారు. అవేంటో చూద్దాం..

  • రిటైల్ పెట్టుబడిదారులకు, స్థిర ఆదాయ ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది గొప్ప సమయం. ప్రభుత్వ బాండ్‌లు, కార్పొరేట్ బాండ్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వివిధ ఉత్పత్తులలో ఇప్పుడు అధిక దిగుబడులను పొందొచ్చు.
  • కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇప్పటికీ 3-5 సంవత్సరాల కాలానికి 8% కంటే ఎక్కువ వడ్డీనే అందిస్తున్నాయి అందువల్ల, స్థిర-ఆదాయ సాధనాల నుంచి అధిక రాబడిని కోరుకునే డిపాజిటర్లు వీటిని బుక్ చేసుకోవచ్చు.
  • అయితే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించే పొదుపు ఖాతా వడ్డీ రేట్లను కూడా సరిపోల్చాలి. వీటిలో చాలా బ్యాంకులు తమ పొదుపు ఖాతాలపై ఖాతాదారులు నిర్వహించే బ్యాలెన్స్ ఆధారంగా 5-7% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి, ఇవి ఎక్కువ -దిగుబడి పొదుపు ఖాతాలు స్వల్పకాలిక బ్యాంక్ ఎఫ్డీల కంటే ఎక్కువ రాబడిని అందిస్తాయి.
  • రిటైల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక ఎఫ్డీలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఎన్బీఎఫ్సీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎఫ్డీలపై సంవత్సరానికి 9.5% వరకు వడ్డీని అందిస్తున్నాయి. వీటిని సులువుగా ప్రారంభించుకునే వీలుంది.
  • ఎంపీసీ సమావేశంలో రెపో రేటును స్థిరంగా ఉంచాలని ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యల కారణంగా ద్రవ్యోల్బణం 2024 ఫిబ్రవరిలో 3.4శాతానికి తగ్గింది. ఇక్కడ ఆహారం, ఇంధనాన్ని మినహాయించారు. ఈ సమయంలో దీర్ఘకాలిక ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచి అధిక, స్థిరమైన రాబడిని పొందేందుకు అవకాశం ఉంది. ఫిక్స్ డ్ డిపాజట్లు ఎన్బీఎఫ్సీలు, పోస్ట్ ఆఫీసుల్లో ఈ స్వల్ప, దీర్ఘకాలిక ఎఫ్డీలపై అధిక వడ్డీ రేట్లు లభించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..