AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెంటల్ అగ్రిమెంట్స్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయిస్తారో తెలుసా..?

అద్దె ఒప్పందాలు సాధారణంగా 11 నెలల కాలానికి కుదుర్చుకోబడతాయి. రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే అద్దె ఒప్పందాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయాలి. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు మరియు స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.

రెంటల్ అగ్రిమెంట్స్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయిస్తారో తెలుసా..?
Rental Agreement
Ram Naramaneni
|

Updated on: Jul 05, 2026 | 4:09 PM

Share

చాలామంది ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు లేదా ఇచ్చినప్పుడు, అద్దె ఒప్పందాలు కేవలం 11 నెలల కాలానికే కుదుర్చుకుంటారు. అయితే, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఒప్పందం చేసుకోవచ్చు కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి ప్రధాన కారణం రిజిస్ట్రేషన్ చట్టం, 1908.

ఈ చట్టం ప్రకారం, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఆస్తిని అద్దెకు ఇస్తే లేదా తీసుకుంటే, ఆ అద్దె ఒప్పందాన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా నమోదు చేయించాలి. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఛార్జీలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన నిబంధనల ప్రకారం అవి మారుతూ ఉంటాయి. లీజ్ కాలం, వార్షిక అద్దె, సెక్యూరిటీ డిపాజిట్ వంటి అంశాల ఆధారంగా కూడా చెల్లించాల్సిన మొత్తం మారవచ్చు.

ఈ అదనపు ఖర్చులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను తగ్గించుకోవడానికే చాలామంది 11 నెలల అద్దె ఒప్పందాలను ఎంచుకుంటారు. 11 నెలల కాలానికి కుదుర్చుకున్న ఒప్పందాలకు సాధారణంగా తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. దీంతో రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ వంటి అదనపు ఖర్చులు ఆదా అవుతాయి. అవసరమైతే 11 నెలల గడువు పూర్తయ్యాక పరస్పర అంగీకారంతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. అందువల్ల 11 నెలల అద్దె ఒప్పందం భూస్వాములు, అద్దెదారులు ఇద్దరికీ ఆర్థికంగా, ఆచరణాత్మకంగా అనుకూలమైన మార్గంగా మారింది.

రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏమిటి?

ఇల్లు, దుకాణం లేదా ఇతర ఆస్తిని అద్దెకు ఇచ్చే వ్యక్తి (భూస్వామి),  అద్దెకు తీసుకునే వ్యక్తి (అద్దెదారు) మధ్య కుదిరే చట్టబద్ధమైన ఒప్పందాన్నే రెంటల్ అగ్రిమెంట్ అంటారు. ఇందులో నెలవారీ అద్దె, అడ్వాన్స్, అద్దె కాలం, ఇరు పక్షాల హక్కులు, బాధ్యతలు, ఇతర షరతులు స్పష్టంగా పేర్కొంటారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర