Railway Budget 2021: ఈసారి రైల్వే బడ్జెట్‌లో కేంద్రం ప్రైవేటు రైళ్లతో పాటు కొత్త రైళ్లపై ఫోకస్ పెట్టనుందా..?
Railway budget 2021: ఫిబ్రవరి 1న కేంద్రం 2021 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది. అయితే ఈ సారి రైల్వే ..
Railway Budget 2021: ఫిబ్రవరి 1న కేంద్రం 2021 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది. అయితే ఈ సారి రైల్వే బడ్జెట్‌లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనే దానినిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే రైల్వే బడ్జెట్. భారత రెవెన్యూలో కీలకపాత్ర పోషించే రైల్వేలకు ఎలాంటి బడ్జెట్ కేటాయిస్తారనేది అందరిలో నెలకొంటున్న ఉత్కంఠ. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో గత ఏడాది కంటే 3 నుంచి 5 శాతం వరకు పెంపు ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.1.80 లక్షల కోట్లను రైల్వేస్ బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని రైల్వే శాఖ ఆర్థిక శాఖను కోరినట్లు తెలుస్తోంది.
అయితే కోవిడ్ ప్రభావంతో చాలా నష్టాలు వచ్చాయని రైల్వ శాఖ నుంచి వచ్చిన ఈ డిమాండ్ ఆచరణలో పెట్టడం అసాధ్యమని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం (2021-22)కు కేంద్రం రూ.1.77 లక్షల కోట్లు రైల్వేలకు కేటాయించనున్నట్లు సమాచారం. అంతేకాదు స్థూల బడ్జెట్ అంచనా రూ.75 వేల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక నష్టాలను పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రైవేటు రైళ్లు నడపడంతో పాటు కొత్త రైళ్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతాలకు రైల్వ కనెక్టివిటీపై కూడా ఫోకస్ చేయనుంది. ఇక కిసాన్ రైలు రూట్లను విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు కావాల్సిన వనరులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కోవిడ్ కారణంగా ఉభయ సభలు ఒక్కో షిప్టులో సమావేశాలు నిర్వహిస్తాయి. ముందుగా రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి.
Also Read: