Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: ఏ పన్ను విధానం మంచిది.. కొత్తదా? పాతదా? ఈసారి ఏం మారనుంది..

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఈ బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

Budget 2021: ఏ పన్ను విధానం మంచిది.. కొత్తదా? పాతదా? ఈసారి ఏం మారనుంది..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2021 | 10:16 AM

New Tax Regime or Old: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఈ బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఎలాంటి పన్నులకు మినహాయింపు ఇస్తుంది. ఎలాంటి వాటికి పరిమితులను విధిస్తుందని జీతం పొందే ప్రతీ ఉద్యోగి ఆలోచిస్తున్నారు. కరోనావైరస్ కారణంగా చాలామంది జీతానికి కోతపడింది. అంతేకాకుండా కొంతమంది ఇప్పటికీ ఇంటినుంచే పనిచేస్తున్నారు. ఈ కారణంగా వారు ఎన్నో రకాల ప్రయోజనాలను ప్రత్యేక్షంగా, పరోక్షంగా పొందలేకపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం తమకు పన్నుల్లో మినహాయింపులిస్తే కొంత ఉపశమనం లభిస్తుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2020 కొత్త పన్ను విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే.. అలాంటి వారికి మంచిందే.. 2020 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమలైంది. పన్ను చెల్లింపుదారుడు కొత్త విధానాన్ని ఎంచుకుంటే అతనికి మినహాయింపులు.. ప్రయోజనాలు లభించవు. ఇందులో పన్ను రేటు 5, 10, 15, 20, 25, 30 శాతం వరకు ఉంది. 15 లక్షలకు పైగా ఆదాయం సంపాదించే వారికి 30 శాతం పన్ను విధించారు. పన్ను చెల్లింపుదారులు డిడెక్షన్లను, మినహాయింపులను సద్వినియోగం చేసుకోకపోతే కొత్త పన్ను విధానం మంచిది. ఎందుకంటే అలాంటి వారికి తక్కువ పన్ను రేటు ఉందని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. పాత పన్ను విధానంలో పన్ను రేట్లు చాలా ఎక్కువని, మినహాయింపులు రావడం లేదని పేర్కొంటున్నారు.

డిడెక్షన్ లిమిట్ పెరిగితే పాత పన్నుతోనే మేలు.. పాత పన్ను విధానంలో 2.5-5 లక్షల వరకు జీతం ఉన్నవారికి 5 శాతం పన్ను, 5-10 లక్షల వరకు 20 శాతం, 10 లక్షలకు పైబడిన వారికి 30 శాతం పన్ను ఉంది. కానీ పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను వ్యవస్థను ఎంచుకుంటే, వారు 70 రకాల తగ్గింపులు, మినహాయింపులను వదులుకోవలసి ఉంటుంది. డిడెక్షన్ లిమిట్ పెరిగే పన్ను చెల్లింపుదారులకు పాత పద్దతితోనే మేలని పేర్కొంటున్నారు. డిడక్షన్‌ రూపంలో 50వేలు, ప్రొఫెషనల్ టాక్స్‌గా రూ .2400, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద 1.5 లక్షలు, లక్ష వరకు ఇంటి అద్దె భత్యం పొందవచ్చు. అయితే పాత పన్ను వ్యవస్థను ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు ఈ సంవత్సరం ప్రత్యక్ష ప్రయాణ భత్యం మాత్రం లభించలేదు. ఇలాంటి పరిస్థితిల్లో ప్రభుత్వం ఉపశమనం ప్రకటిస్తే వారికి శుభవార్తే అవుతుందని పేర్కొంటున్నారు.

Also Read:

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

Budget 2021: మరో రెండు రోజులు.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక బడ్జెట్.. లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించండి ఇలా..

Budget 2021: పార్లమెంట్ బడ్జెట్ సెషన్, నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, విపక్షాల నుంచి ‘చట్టాల సెగ’