Railway Budget 2021: రేపు కేంద్ర బడ్జెట్.. ప్రైవేటు రైళ్ల కూత.. కొత్త రైళ్లపై ప్రత్యేక దృష్టి
Railway Budget 2021: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనే దానినిపై..

Railway Budget 2021: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనే దానినిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే రైల్వే బడ్జెట్. భారత రెవెన్యూలో కీలకపాత్ర పోషించే రైల్వేలకు ఎలాంటి బడ్జెట్ కేటాయిస్తారనేది అందరిలో నెలకొంటున్న ఉత్కంఠ. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్‌లో ఎక్కువగానే పెంపు ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.1.80 లక్షల కోట్లను రైల్వేస్ బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని రైల్వే శాఖ ఆర్థిక శాఖను కోరినట్లు తెలుస్తోంది.
రానున్న ఆర్థిక సంవత్సరం (2021-22)కు కేంద్రం రూ.1.77 లక్షల కోట్లు రైల్వేలకు కేటాయించనున్నట్లు సమాచారం. అంతేకాదు స్థూల బడ్జెట్ అంచనా రూ.75 వేల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక నష్టాలను పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రైవేటు రైళ్లు నడపడంతో పాటు కొత్త రైళ్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతాలకు రైల్వ కనెక్టివిటీపై కూడా ఫోకస్ చేయనుంది. ఇక కిసాన్ రైలు రూట్లను విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు కావాల్సిన వనరులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ఉండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణీకుల రైళ్లు కూత పెట్టలేదు. గూడ్స్ చేరవేతకు సంబంధించి కొన్ని రైళ్లను మాత్రమే అధికారులు పట్టాలెక్కించారు. ఈ సమయంలో ట్రాక్‌లు, ఇతర పనులను పునరుద్ధరించడంపై రైల్వే అధికారులు దృష్టి పెట్టారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కార్మికులతో మానవశక్తిని ద్వారా మరమత్తు పనులను పూర్తి చేయాల్సి వచ్చింది. అదేవిధంగా, ఎక్స్‌ప్రెస్‌వేలతో సహా పెద్ద ప్రాజెక్టులు చేపటాల్సి ఉన్నందున నిధుల కేటాయింపును సుమారు 10% పెంచాలని రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
Budget 2021: ఏ పన్ను విధానం మంచిది.. కొత్తదా? పాతదా? ఈసారి ఏం మారనుంది..