Budget 2021: పార్లమెంట్ బడ్జెట్ సెషన్, నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, విపక్షాల నుంచి ‘చట్టాల సెగ’

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ని పురస్కరించుకుని శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలకు లెజిస్లేటివ్ అజెండాను ప్రభుత్వం ఈ సమావేశాల్లో..

Budget 2021: పార్లమెంట్ బడ్జెట్ సెషన్, నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, విపక్షాల నుంచి 'చట్టాల సెగ'
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 12:11 PM

Budget 2021: పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ని పురస్కరించుకుని శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలకు లెజిస్లేటివ్ అజెండాను ప్రభుత్వం ఈ సమావేశాల్లో సమర్పిస్తుంది. శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా సమావేశాలను ప్రారంభించారు. ఈ అఖిల పక్ష భేటీలో ప్రతిపక్షాలు ముఖ్యంగా రైతుల ఉద్యమాన్ని ప్రస్తావించవచ్ఛు.  ప్రధాని మోదీని ఇరకాటంలో పెట్టేందుకు యత్నించవచ్ఛు. (వర్చ్యువల్ గా ఈ సమావేశం జరుగుతుంది.) రైతుల ఆందోళనపై పార్లమెంట్ సెషన్ లో చర్చ జరగాలని విపక్షాలు…. స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన సమావేశంలో డిమాండ్ చేశాయి. అయితే ఈ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరగనున్న చర్చ సందర్భంగా లేవనెత్తవచ్ఛునని ప్రభుత్వం సూచించింది. ఇందుకు లోక్ సభలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో 10 గంటల సమయాన్ని కేటాయించారు.