Undavalli letter: విభజనచట్టాన్ని ఉల్లంఘించొద్దు..జగన్‌కు ఉండవల్లి లేఖ
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు. ఈసారి ఓ భూమి విషయంలో కాస్త ఘాటైన లేఖతో తెరమీదికి వచ్చారు ఉండవల్లి. ఈ వారంలో జగన్‌కు ఉండవల్లి రాసిన మూడో లేఖ ఇది.
Undavalli writes CM Jagan: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు. ఈసారి ఓ భూమి విషయంలో కాస్త ఘాటైన లేఖతో తెరమీదికి వచ్చారు ఉండవల్లి. ఇళ్ళ స్థలాల పేరిట సేకరిస్తున్న భూముల్లో విద్యాసంస్థలను టార్గెట్ చేయడం కరెక్టు కాదని ఉండవల్లి తన తాజా లేఖలో పేర్కొన్నారు.
రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాల స్ధలాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు ఉండవల్లి. 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, తెలుగు విజ్ఞాన పీఠం నిర్మాణం 45 ఎకరాల స్ధలంలో జరిగిందని, అందులో గతంలో 25 ఎకరాలు నేక్ నిర్మాణాలకు తీసుకుందని లేఖలో వివరించారాయన.
తెలుగు రాష్ట్రాలలో తెలుగు యూనివర్శిటీకి మొత్తం అయిదు క్యాంపస్‌లు ఉన్నాయని, ఈ నేపథ్యంలో మొత్తం తెలుగు యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారని వివరించారు ఉండవల్లి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75ను ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని, విద్యాలయాలకు, యూనివర్శిటీలకు చెందిన ఏ భూమినీ కూడా గృహ నిర్మాణాలకు వాడరాదని వుండగా దాన్ని ఇపుడు ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు ఉండవల్లి. 2014 కేంద్ర చట్టం 6లోని Xవ షెడ్యూల్‌లో ఐటెమ్ నంబరు 59 గురించి కలెక్టర్ పట్టించుకోలేదని వాదిస్తున్నారు ఈ మాజీ ఎంపీ.
జీఓ ఎంఎస్ నంబర్ 510కు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 75కు వ్యతిరేకంగా కలెక్టర్ నిర్ణయం ఉందని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని తక్షణం నిలిపి వేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.
Read this: ఎమ్మెల్యేలకు కేసీఆర్ లిట్మస్ టెస్టు KCR litmus test for MLAs