భారత్ బంద్ నాడు టీఆర్ఎస్ రహదారుల దిగ్బంధం.. హైవేలపై ధర్నాలు చేస్తామన్న కేటీఆర్.. ఎక్కడి వారక్కడే ధర్నాలు

కేంద్రంపై యుద్దం చేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నంత పని చేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పెద్ద యుద్దానికి టీఆర్ఎస్ పార్టీ తెరలేపింది. జాతీయ రహదారులపై ధర్నాలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చింది.

భారత్ బంద్ నాడు టీఆర్ఎస్ రహదారుల దిగ్బంధం.. హైవేలపై ధర్నాలు చేస్తామన్న కేటీఆర్.. ఎక్కడి వారక్కడే ధర్నాలు
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 06, 2020 | 5:23 PM

TRS to block national highways: డిసెంబర్ 8వ తేదీన జరగనున్న భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. ఎక్కడి నేతలు అక్కడే జాతీయ రహదారులపై ధర్నాలు చేస్తామని తెలంగాణ మునిసిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ప్రకటించారు. పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇటీవల వెలువడిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలను కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో సమీక్షించారు. టీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతాంగానికి ఆయన సంఘీభావం ప్రకటించారు. భారత్ బంద్ రోజున తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. ఎక్కడి నేతలు అక్కడే జాతీయ రహదారులపై ధర్నాలు చేస్తామని తెలంగాణ మునిసిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ప్రకటించారు. పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

‘‘ కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పార్టీ తరపున వాదనలు చెప్పాలని కేసీఆర్ ఆనాడే చెప్పారు.. పార్లమెంటులో రైతు వ్యతిరేక బిల్లును టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది.. చల్లటి చలిలో రైతులు రోడ్లపై పోరాటం చేస్తున్నారు.. కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా పోరాటం చేస్తాం.. డిసెంబర్ 8వ తేదీన రైతుల బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.. బంద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటారు. ప్రతి వ్యాపారవేత్త  ఉదయం 10 గంటలకు కాకుండా మధ్యాహ్నం 12 గంటలకు దుకాణాలు తెరవండి.. రెండు గంటలు బంద్ పాటించండి.. వాణిజ్య- వ్యాపార సంస్థలు రైతు బంద్‌కు సహకరించండి.. ట్రాన్స్ పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరు బంద్‌కు సహకరించండి.. టీఆరెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాలు- రాస్తారోకో చేస్తారు.. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి.. ’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ALSO READ: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపికపై ఉత్కంఠ.. డిసెంబర్ 9న నిర్ణయం!