రేసులో ఎందరో.. అదృష్టం ఎవరిదో..? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపికపై ఉత్కంఠ.. డిసెంబర్ 9న నిర్ణయం!

చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా పదుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ అధ్యక్ష స్థానం కోసం ఉత్సాహం చూపిస్తూ.. తమ క్వాలిటీస్‌ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నాలను ముమ్మరం చేశారు..

రేసులో ఎందరో.. అదృష్టం ఎవరిదో..? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపికపై ఉత్కంఠ.. డిసెంబర్ 9న నిర్ణయం!
Follow us

|

Updated on: Dec 06, 2020 | 5:24 PM

Many are in race for TPCC chief post: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీలో ఆత్మావలోకానికి దారితీస్తే.. బీజేపీలో నూతనోత్సాహాన్ని రేకెత్తించాయి. అదే సమయంలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌లో మాత్రం అధ్యక్ష స్థానం కోసం రేసుకు గ్రేటర్ ఫలితాలు దారి తీసాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా పదుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ అధ్యక్ష స్థానం కోసం ఉత్సాహం చూపిస్తూ.. తమ క్వాలిటీస్‌ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గ్రేటర్ ఫలితాలు వెలువడిన వెంటనే గతంలో వున్న రెండు స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమవడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా లేఖ అటు ఏఐసీసీ అధ్యక్షురాలికి అందీ అందకుండానే.. అక్కడ ఆయన రాజీనామాకు ఇంకా ఆమోదం లభించక ముందే.. పీసీసీ అధ్యక్ష స్థానానికి రేసు మొదలైంది.

నిజానికి తెలంగాణ కాంగ్రెస్ గత ఆరేళ్ళుగా వరుస ఓటముల బాటలోనే కొనసాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. ఆరునెలల వ్యవధిలోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించి.. ఫరవాలేదనుకుంటున్న తరుణంలోనే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మళ్ళీ చతికిలా పడింది. 2018లో స్వయంగా పీసీసీ అధ్యక్షనిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్‌లో విజయం సాధించినా.. ఆ తర్వాత తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్‌లో తన సతీమణిని గెలిపించుకోలేకపోయారు. ఆనాటి నుంచి ఉత్తమ్ కుమార్ పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ పార్టీలో అడపాదడపా వినిపిస్తూనే వుంది. ఆ తర్వాత నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక.. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక.. ఇలా కాంగ్రెస్ పార్టీకి వరుస ఓటములే మిగిలాయి. దాంతో పలువురు తరచూ అధిష్టానాన్ని కలిసి పీసీసీ అధ్యక్షుని మార్పు అనివార్యమని చెబుతూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాప చేసింది.

తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో అత్యంత ఫేలవమైన ప్రదర్శన చేసిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా కొనసాగలేనంటూ ఉత్తమ్ కుమార్ ఎట్టకేలకు రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. దాంతో టీపీసీసీ అధ్యక్ష స్థానం కోసం బహిరంగంగానే రేసు మొదలైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంపై గతంలో పలుమార్లు పెదవి విరిచిన నేతలంతా ఇపుడు ఢిల్లీకి క్యూ కట్టారు. తమకు అవకాశం కల్పించాలని అధిష్టానానికి విన్నవించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో గాంధీభవన్ వేదికగా శనివారం నాడు సమావేశం నిర్వహించి.. తమలో ఎవరికి అవకాశం దక్కినా కలిసి పని చేస్తామన్న సందేశాన్ని అధిష్టానానికి పంపారు. ప్రస్తుతం రేసులో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముందున్నట్లు కనిపిస్తోంది. వీరిలో శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి పరస్పరం ఎవరికి అవకాశం దక్కినా కలిసి పనిచేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. వీరు ముగ్గరే కాకుండా పీసీసీ పీఠం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పదికి పైగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (విహెచ్) ఆదివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూనే తనకు పీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి, జీవన్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు కూడా టీపీసీసీ పీఠాన్ని ఆశిస్తూ తమదైన మార్గంలో ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకంపై డిసెంబర్ 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ప్రకటన వెలువడవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. వైద్యుల సలహా మేరకు గోవాలో వున్నారు. ఆమె డిసెంబర్ 7వ తేదీన న్యూఢిల్లీ చేరుకున్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాలేఖను ఆమెకు అందజేస్తారని తెలుస్తోంది. సోనియా గాంధీ ఆదేశాలతో డిసెంబర్ 8వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి పార్టీ సీనియర్లతో సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ఠాగూర్ స్వయంగా సోనియాగాంధీకి చేరవేస్తారని, ఆ తర్వాతనే అధినేత్రి టీపీసీసీ అధ్యక్షుని నియామకంపై ఓ కంక్లూజన్‌కు వస్తారని తెలుస్తోంది.

ALSO READ: భారత్ బంద్ నాడు టీఆర్ఎస్ రహదారుల దిగ్బంధం.. హైవేలపై ధర్నాలు చేస్తామన్న కేటీఆర్

Latest Articles
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!