Congress Gharwapsi: ఘర్‌ వాపసీ అంటున్న కాంగ్రెస్‌ నేతలు.. వ్యతిరేకిస్తున్న లోకల్‌ లెవెల్ కేడర్‌!

లీడర్లేమో ఘర్‌ వాపసీ అంటున్నారు. కేడర్‌ ఏమో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. దీంతో టీ కాంగ్రెస్‌లో ఘర్‌ వాపసీ గలాటాతో గత్తర లేస్తోంది. ఆదిలాబాద్‌ టూ నల్లగొండ.. ఎక్కడ చూడు, కాంగ్రెస్‌లో ఇదే లొల్లి. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల రాకను లోకల్‌ లీడర్స్ అడ్డుకోవడంతో చేరికల చిచ్చు రగులుతోంది.

Congress Gharwapsi: ఘర్‌ వాపసీ అంటున్న కాంగ్రెస్‌ నేతలు.. వ్యతిరేకిస్తున్న లోకల్‌ లెవెల్ కేడర్‌!
Telangana Congress
Follow us

|

Updated on: May 04, 2024 | 10:55 AM

లీడర్లేమో ఘర్‌ వాపసీ అంటున్నారు. కే డర్‌ ఏమో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. దీంతో టీ కాంగ్రెస్‌లో ఘర్‌ వాపసీ గలాటాతో గత్తర లేస్తోంది. ఆదిలాబాద్‌ టూ నల్లగొండ.. ఎక్కడ చూడు, కాంగ్రెస్‌లో ఇదే లొల్లి. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల రాకను లోకల్‌ లీడర్స్ అడ్డుకోవడంతో చేరికల చిచ్చు రగులుతోంది. లోక్‌సభ ఎన్నికల వేళ క్షేత్రస్థాయి పంచాయితీతో హస్తం పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంటోందట.

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్‌..ఘర్‌ వాపసీ అంటోంది. ఇతర పార్టీల నుంచి నేతలకు వెల్‌కమ్‌ చెబుతోంది. రండి పార్టీలో చేరండి అంటూ ఆహ్వానిస్తోంది. అయితే లోకల్‌ లెవల్లో నేతలు, కేడర్‌ దీన్ని వ్యతిరేకిస్తుండడంతో చేరికల చిచ్చు కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదిలాబాద్‌లో ఇదే ఇష్యూ పార్టీలో మంటలు రేపుతోంది. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌లో ఉండి, మంత్రి పదవి అనుభవించిన ఇంద్రకరణ్‌ రెడ్డి…అధికారం పోగానే జంప్‌ కొట్టి కాంగ్రెస్‌లో చేరడాన్ని డీసీసీ ప్రెసిడెంట్‌ శ్రీహరి రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఆదిలాబాద్‌కు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో..జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో సన్నాహక సమావేశం జరిగింది. దీనికి డీసీసీ ప్రెసిడెంట్‌ డుమ్మా కొట్టారు. రాహుల్‌ రాక నేపథ్యంలో ఇలా ఘర్‌వాపసీ గలాటా జరగడం, పార్టీలో కలకలం రేపింది.

ఇక అదే ఆదిలాబాద్‌లో… పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన డీసీసీ మాజీ నేత సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ నేత గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కంది వర్గం భగ్గుమంది. ఆయా నేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన వారిని, తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గండ్ర సుజాత వర్గంపై వేటు వేయాలని, లేదంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం అల్టిమేటం ఇచ్చింది. చేరికల వ్యవహారం చిచ్చు రేపడంతో టీ పీసీసీ స్పందించింది. అదిలాబాద్‌లో నేతల చేరికను తాత్కాలికంగా నిలిపి వేశామని ఓ ప్రకటనలో తెలిపారు టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు జగ్గారెడ్డి.

మిర్యాలగూడలో ఘర్‌ వాపసీ చిచ్చు

ఇక మిర్యాలగూడ కాంగ్రెస్‌లో కూడా చేరికల చిచ్చు రేగింది. ఘర్ వాపసీలో భాగంగా బీఆర్ఎస్‌కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. దీనికి కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ చీఫ్‌ శంకర్ నాయక్ లను కలవకుండానే నేరుగా హైదరాబాదు వచ్చి, గాంధీభవన్‌లో దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకుంది భార్గవ్‌ వర్గం. దీంతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం మండిపడుతోంది. భార్గవ్‌ రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పార్టీలో ఎవరు చేరాలన్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలంటున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్. మిర్యాలగూడలో చెలరేగిన చేరికల చిచ్చును, చల్లార్చేందుకు పీసీసీ రంగంలోకి దిగింది. మున్సిపల్‌ చైర్మన్ భార్గవ్, ఇతర కౌన్సిలర్ల చేరిక చెల్లదంటూ…టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. భార్గవ్ చేరికను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. చూడాలి మరీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో అంతర్గత విభేదాలు ఎటు వైపు దారి తీస్తాయో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles