AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆమె అందమే ఆశ్చర్యం.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్న వయ్యారి.. ఎవరో గుర్తుపట్టరా ?..

జోడే రెజో రాజ్, ఝూమ్ఝూమ్, హవా హమే ఉదతి జాయే, యే కిస్నే జాదూ కియా, మేరీ చునర్ ఉద్ద్ అద్ద జాయే, మైనే పాయల్ హై ఛంకై, అయ్యో రామా వంటి సూపర్ హిట్ సాంగ్స్ అప్పట్లో కుర్రకారును ఊర్రూతలుగించాయి. అందులో అమ్మాయిలకు ఇష్టమైన సాంగ్స్ లో మేరీ చునర్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే ఒకటి. ఇప్పటికీ ఈ పాటకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ పాటలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కలిసి నటించారు. కెరీర్ ప్రారంభం ఆ ఇద్దరు చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే. పైన ఫోటోను చూశారు కదా.. మేరీ చునర్ పాటకు సంబందించిన పిక్ అది.

Tollywood: ఆమె అందమే ఆశ్చర్యం.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్న వయ్యారి.. ఎవరో గుర్తుపట్టరా ?..
Actress
Rajitha Chanti
|

Updated on: May 04, 2024 | 10:41 AM

Share

బాలీవుడ్ ఫేమస్ సింగర్ ఫల్గుణి పాఠక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈతరం యువతకు అంతగా తెలియకపోవచ్చు. కానీ 90’s చిన్నారులకు ఇష్టమైన గాయని. ఇప్పటికీ ఆమె కంపోజ్ చేసిన సాంగ్స్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. జోడే రెజో రాజ్, ఝూమ్ఝూమ్, హవా హమే ఉదతి జాయే, యే కిస్నే జాదూ కియా, మేరీ చునర్ ఉద్ద్ అద్ద జాయే, మైనే పాయల్ హై ఛంకై, అయ్యో రామా వంటి సూపర్ హిట్ సాంగ్స్ అప్పట్లో కుర్రకారును ఊర్రూతలుగించాయి. అందులో అమ్మాయిలకు ఇష్టమైన సాంగ్స్ లో మేరీ చునర్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే ఒకటి. ఇప్పటికీ ఈ పాటకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ పాటలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కలిసి నటించారు. కెరీర్ ప్రారంభం ఆ ఇద్దరు చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే. పైన ఫోటోను చూశారు కదా.. మేరీ చునర్ పాటకు సంబందించిన పిక్ అది. అందులో కనిపిస్తున్న ఇద్దరు కథానాయికలను గుర్తుపట్టండి. తెలుగు, హిందీ, తమిళంలో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఒకరు సినిమాలకు దూరంగా ఉంటుండగా.. మరొకరు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో అలరిస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే హీరోయిన్ అయేషా టాకీయా, కోలీవుడ్ నటి త్రిష. ఈరోజు హీరోయిన్ త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ సాంగ్ మేరీ చునర్ నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

త్రిష 1983 మే 4న మద్రాసులో జన్మించింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన త్రిష 1999లో మిస్ చెన్నై టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి మోడలింగ్ రంగంలో రాణిస్తుంది. 2000 సంవత్సరంలో తన చదువును పూర్తి చేసిన తర్వాత, త్రిష మొదటిసారిగా ఫల్గుణి పాఠక్ రూపొందించిన మేరీ చునార్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే పాటలో కనిపించింది. ఈ పాట అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో త్రిషను చూసిన డైరెక్ట్ర ప్రియదర్శన్ ఆమెకు 2003లో లేసా లేసా సినిమాలో అవకాశమిచ్చాడు. తెలుగులో వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటింటింది.

2010లో బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘ఖట్టా మీఠా’ చిత్రంలో నటించింది. రీసెంట్‌గా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో త్రిష ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇక అలాగే ఇటీవలే లియో సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాలుగు పదుల వయసులోనూ చేతినిండా సినిమాలతో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కనిపించనుంది. ఫల్గుణి పాఠక్ హిట్ ట్రాక్‌లో కనిపించినప్పుడు త్రిషకు కేవలం 18 ఏళ్లు మాత్రమే. తెలుగులో మొదటి సినిమాకే  ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకుంది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!