ఎడ్లబండి కింద పడి మూడేళ్ల బాలుడు మృతి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న తల్లిదండ్రుల వెంబడి వెళ్లిని మూడేళ్ల చిన్నారి ఎడ్ల బండి నుంచి జారిపడి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

చింతలమానేపల్లి మండలంలోని కర్జేల్లి గ్రామానికి చెందిన చెందిన అంజన్న, సంధ్య దంపతులు వృత్తిరీత్యా వ్యవసాయదారులు. రోజు వారి క్రమంలో పొలం వద్దకు ఎరువుల సంచులను ఎద్దుల బండిపై తీసుకెళ్తున్నారు. ఈ బండిపై అంజన్నతో పాటు సంధ్య, కుమారుడు కుబిడే వరుణ్(3) కూడా ఉన్నారు. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే దారి మధ్యలో ప్రమాదవశాత్తు ఎద్దుల బండి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వరుణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్యాభర్తలిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. ఎరువుల సంచులన్నీ బాలుడిపై పడడంతో.. అతనికి ఊపిరాడక అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆ దంపతులను ఒదార్చడం ఎవరివల్ల కాలేకపోయింది.