కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాం.. మోదీ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇతర ప్రపంచ దేశాలకు ఇండియా ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. శీఘ్రగతిన అభివృధ్ది చెందుతున్న దేశంగా, స్వేఛ్చాయుత 'ప్రజాస్వామ్య సమాజం', క్రమశిక్షణ, నిర్ణయాత్మకతతో కూడిన దేశంగా..
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇతర ప్రపంచ దేశాలకు ఇండియా ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. శీఘ్రగతిన అభివృధ్ది చెందుతున్న దేశంగా, స్వేఛ్చాయుత ‘ప్రజాస్వామ్య సమాజం’, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతతో కూడిన దేశంగా ఈ తరుణంలో ఆయా దేశాలకు ఇండియాను చూపగలిగామని ఆయన చెప్పారు. అలీన దేశాల శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. భారత దేశ వ్యక్తిగత అవసరాలు ఎన్ని ఉన్నా.. ఈ కరోనా తరుణంలో 123 దేశాలకు వైద్య సాయం అందించగలిగామని, వీటిలో ‘నామ్’ సభ్యత్వ దేశాలు సుమారు 53 ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వైరస్ ను నివారించేందుకు మేం అన్ని దేశాలతో సమన్వయంగా, సహకార రీతిలో వ్యవహరించాం అని మోదీ స్పష్టం చేశారు. ఇతర దేశాలతో మా దేశ మెడికల్ ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకునేందుకు ఆన్ లైన్ కోచింగ్ ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా దేశంలో ప్రాచీన కాలం నుంచే వస్తున్న ఆయుర్వేద వైద్య ప్రాశస్త్యాన్ని ఆయన వివరించారు. ఇండియాలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు లభిస్తున్నాయన్నారు. మోదీతో బాటు ముప్పయ్ దేశాల అధినేతలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కోవిడ్-19 ని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఓ డిక్లరేషన్ ని ఈ సదస్సులో ఆమోదించారు.