మహీంద్రా బాట్టిస్టా: ప్రపంచంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా తాజాగా అత్యంత వేగంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. జెనీవాలో జరుగుతున్న మోటార్ షో కార్యక్రమంలో మహీంద్రాకు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ పినిన్‍ఫెరిన‌ ‘బాట్టిస్టా’ అనే కారును ఆవిష్కరించింది. ఇదే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు. ఇది వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది. For those of you who asked for a better view of the car. This white #Battista […]

మహీంద్రా బాట్టిస్టా: ప్రపంచంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 11:11 AM

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా తాజాగా అత్యంత వేగంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. జెనీవాలో జరుగుతున్న మోటార్ షో కార్యక్రమంలో మహీంద్రాకు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ పినిన్‍ఫెరిన‌ ‘బాట్టిస్టా’ అనే కారును ఆవిష్కరించింది. ఇదే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు. ఇది వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది.

ఫార్ములా 1 కారు కన్నా బాట్టిస్టా వేగవంతమైంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2 సెకన్ల కన్నా తక్కువ సమయంలోనే అందుకుంటుంది. ఈ కారు గంటకు 402 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒక సారి ఛార్జ్‌ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్తుంది. కాగా కంపెనీ కేవలం 150 కార్లను మాత్రమే తయారు చేయనుంది.

నమ్మలేని విధంగా బాట్టిస్టా పనితీరు ఉంటుందని పినిన్‍ఫెరిన సీఈవో మైఖల్‌‌ తెలిపారు. ఇది భవిష్యత్తు తరం హైపర్‌ కారని కితాబిచ్చారు. వాహన పరిశ్రమ చరిత్రలో దీని పేరు నిలిచిపోయేలా తయారు చేశామని పేర్కొన్నారు. బాట్టిస్టా ఆవిష్కరణ అంశాన్ని మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పంచుకున్నారు.