మరింత పెరగనున్న ఎండలు
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం గరిష్ఠంగా నాగర్‌కర్నూల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 39.3, జగిత్యాల, వనపర్తిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా 39 డిగ్రీలు, రెండు డిగ్రీలు ఎక్కువగా మెదక్ జిల్లాలో 38, ఖమ్మంలో 37 […]
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం గరిష్ఠంగా నాగర్‌కర్నూల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 39.3, జగిత్యాల, వనపర్తిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా 39 డిగ్రీలు, రెండు డిగ్రీలు ఎక్కువగా మెదక్ జిల్లాలో 38, ఖమ్మంలో 37 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శాస్త్రవేత్త నాగరత్న పేర్కొన్నారు.