ఇవాళ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ను ఇవాళ సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడ్చల్‌జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సీఎం అంచనాల మేరకు ధరణి పోర్టల్‌ ద్వారా సులభంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలంచించేలా రెవెన్యూ సిబ్బందిని సమాయాత్తం చేశారు. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రారంభం తర్వాత…జర్నలిస్టులతో కలిసి లంచ్‌ చేస్తారు. అనంతరం […]

  • Venkata Narayana
  • Publish Date - 6:44 am, Thu, 29 October 20
ఇవాళ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ను ఇవాళ సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడ్చల్‌జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సీఎం అంచనాల మేరకు ధరణి పోర్టల్‌ ద్వారా సులభంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలంచించేలా రెవెన్యూ సిబ్బందిని సమాయాత్తం చేశారు. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రారంభం తర్వాత…జర్నలిస్టులతో కలిసి లంచ్‌ చేస్తారు. అనంతరం మూడుచింతలపల్లి శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు పోర్టల్‌కు సంబంధించిన సందేశాన్ని ఇస్తారు.